పార్టీ మారడంపై అతి త్వరలోనే చెబుతా: రాజగోపాల్ రెడ్డి - MicTv.in - Telugu News
mictv telugu

పార్టీ మారడంపై అతి త్వరలోనే చెబుతా: రాజగోపాల్ రెడ్డి

March 16, 2022

party

తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డిల పాత్ర ఎంత కీలకమైనదో ప్రత్యేకంగా చెప్పనవరసం లేదు. కొన్ని ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున ఎమ్మెల్యేగా, ఎంపీలుగా పదవులను చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో గతంలో కాంగ్రెస్ పార్టీని వీడి, బీజేపీలో చేరుబోతున్నామని.. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎంత సంచలనం రేపాయో తెలిసిందే. ఈ సందర్భంగా బుధవారం మరోసారి మీడియాతో మాట్లాడిన ఆయన.. పార్టీ మారడంపై అతి త్వరలోనే స్పష్టత ఇస్తానని అన్నారు. దీంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఆయన మాట్లాడుతూ ”గౌరవం ఇవ్వని చోట ఉండలేను. ఎవరి కింద పడితే వారి కింద పని చేయను. తగిన వేదిక ద్వారా కేసీఆర్‌పై పోరాడుతా. పార్టీ మార్పుపై త్వరలోనే ఓ స్పష్టత ఇస్తా. నన్ను నమ్మినవారు నా వెంట రావొచ్చు” అని అన్నారు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీలో జరిగిన ఘటన రాజగోపాల్ రెడ్డి అసంతృప్తికి కారణమైంది. ప్రాజెక్టుల రీడిజైన్ పేరిట రూ. లక్షల కోట్లు అప్పులు చేసి సీమాంధ్ర కాంట్రాక్టర్లకు దోచిపెట్టారంటూ టీఆర్ఎస్ సర్కారుపై ఆయన ఆరోపణలు చేశారు.

అంతేకాకుండా ఈ ఆరోపణల విషయంలో తనకు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మధ్య జరిగిన సంభాషణకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మద్దతుగా నిలవలేదని కోమటిరెడ్డి మండిపడ్డారు. “మా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గట్టిగా నిలబడేది ఉండే. ఇద్దరు మాట్లాడింది తప్పు అన్నారు. ఏం లాభం నా మాటలు రికార్డుల నుంచి తొలగించారు. వారిని అట్లే ఉంచారు. నా కోసం మా సభ్యులు గట్టిగా నిలబడి ఉంటే ఎంత బలం ఉండేది. భట్టి విషయంలో ప్రతీ అంశంలో అండగా ఉన్నాం. ఆయన మాత్రం మమ్మల్ని వదిలేశారు” అంటూ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.