I Will get married soon: AAP MP Raghav Chadha
mictv telugu

సీఎంకు రెండో పెళ్లి జరిపించా.. ఇక నేను కూడా చేసుకుంటా : యువ ఎంపీ

July 8, 2022

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ (48) గురువారం రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ పెళ్లికి ఆప్ పార్టీ యువ ఎంపీ రాఘవ్ చద్దా పెళ్లి పెద్దగా వ్యవహరించారు. కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ పెళ్లికి ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాఘవ్ చద్దా మాట్లాడుతూ.. ‘నాకు పెద్దన్నయ్య లాంటి భగవంత్ మాన్ పెళ్లికి పెద్దగా ఉండి వ్యవహరించా. ఇక నుంచి ఆ కుటుంబంలో సంతోషం వెల్లివిరియనుంది. వారి సంతోషం చూసి నేను భావోద్వేగానికి లోనయ్యా. ఈ కార్యం సందర్భంగా అందరూ నీ పెళ్లెప్పుడు అని అడుగుతున్నారు. త్వరలో నేను కూడా పెళ్లి చేసుకుంటా’నని అభిప్రాయపడ్డారు. కాగా, మెడిసిన్‌లో టాపర్ అయిన 32 ఏళ్ల గురు ప్రీత్ కౌర్‌ను భగవంత్ మాన్ పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి మధ్య వయసు తేడా 16 ఏళ్లు కావడం గమనార్హం.