పెళ్లి చేసుకుంటే 20 కోట్లిస్తా.. హీరోకు అమ్మాయి ఆఫర్ - MicTv.in - Telugu News
mictv telugu

పెళ్లి చేసుకుంటే 20 కోట్లిస్తా.. హీరోకు అమ్మాయి ఆఫర్

March 11, 2022

06

ఓ అమ్మాయి హీరోకి ఇచ్చిన ఈ ప్రపోజల్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. వివరాల్లోకెళితే.. బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ ఓ చిన్నపాపతో ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అది చూసిన వారందరూ మెచ్చుకుంటూ కామెంట్లు పెట్టారు. కానీ ఓ అమ్మాయి మాత్రం నేను మీ అభిమానినంటూ తనను పెళ్లి చేసుకుంటే 20 కోట్ల రూపాయలు ఇస్తానంటూ కామెంట్ చేసింది. దానికి బదులుగా కార్తీక్ ఆర్యన్ హాస్యంగా ఎప్పుడు పెళ్లి చేసుకుందామంటూ రిప్లై ఇచ్చాడు. ఇది చూసిన మిగతా లేడీ అభిమానులు రకరకాల ఆఫర్స్ ఇస్తూ పెళ్లి చేసుకోమని కామెంట్స్ చేశారు. దీంతో నా కోసం వేలంపాట మొదలైందా అంటూ ఫన్నీగా బదులిచ్చాడు ఈ యంగ్ హీరో. ఇదంతా చూసిన మిగతా వారు కార్తీక్ ఆర్యన్‌కు రిచ్ ఫ్యాన్స్ ఉన్నారంటూ కామెంట్ చేస్తున్నారు.