I will help Sunita: KTR
mictv telugu

సునీతకు నేను సాయం చేస్తా: కేటీఆర్‌

August 31, 2022

జార్ఖండ్‌ రాష్ట్రానికి చెందిన బీజేపీ సస్పెండెడ్‌ నేత సీమా పాత్రా..తన ఇంట్లో పనిచేసే ఓ గిరిజన మహిళ (సునీత)ను అత్యంత పైశాచికంగా చిత్ర హింసిలకు గురిచేస్తూ, పని మనిషి నాలుకతో టాయిలెట్‌ను శుభ్రం చేయించిన సంఘటన దేశవ్యాప్తంగా ఎంత వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పనిమనిషి సునీత సెల‌వులు కావాలని అడిగితే, తీవ్రంగా కొట్ట‌డమే కాకుండా, బాధితురాలిని ఓ గ‌దిలో బంధించి, ఇనుప రాడ్‌తో కొడితే, ప‌ళ్లు ఊడిపోయాయి. ఈ ఉదంతంపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. బాధితురాలు సునీతకు సాయం అందిస్తానని ప్రకటించారు.

కోలుకుంటే..తనకు చదువుకోవాలని ఉందంటూ బాధితురాలు చెప్పిన ఓ వీడియోను ప్రముఖ జర్నలిస్ట్‌ బర్ఖా దత్ పోస్ట్‌ చేశారు. ఆ వీడియోలో..”ఆమె పళ్లు విరిగిపోయాయి. ఎనిమిదేళ్లుగా నరకం అనుభవించింది. సీమాపాత్ర ఆమెను క్రూరంగా హింసించింది. కోలుకున్నాక చదువుకోవాలని బాధితురాలు చెప్పింది” అంటూ దత్‌ ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ ఘటనపై కేటీఆర్‌ స్పందిస్తూ..”నేను వ్యక్తిగతంగా ఆమె చదువుకు అవసరమయ్యే సాయం అందించేందుకు సిద్ధం. అంతేకాదు, ఆమె కుటుంబ సభ్యుల వివరాలను పంపండి.”అని కేటీఆర్‌ ఆ విలేఖరిని కోరారు.

గిరిజన మహిళ సునీతను..రాంచీ అశోక్‌ నగర్‌లోని తన లగ్జరీ ఇంటి పనుల కోసం బీజేపీ సస్పెండెడ్‌ నేత సీమా పాత్రా ఎనిమిదేళ్ల కిందట తెచ్చుకుంది. చిటికిమాటికి సునీతను దారుణంగా హింసించింది. ఈ ఉదంతం బయటపడడంతో సీమా పాత్రా పారిపోయింది. అప్రమత్తమైన పోలీసులు..ఆమెను వెంబడించి ఎట్టకేలకు ఇవాళ ఉదయం అరెస్ట్‌ చేశారు. మరోవైపు ఆమెను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు బీజేపీ ప్రకటించింది. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన జాతీయ మహిళా కమిషన్‌..సీమపై కఠిన చర్యలు తీసుకోవాలని జార్ఖండ్‌ డీజీపీని ఆదేశించింది.

అయితే, ఈ ఘటన వెలుగులోకి రావడానికి ప్రధాన కారకుడు..సీమా పాత్రా కుమారుడేనని తాజా సమాచారం. తన తల్లి పనిమనిషి పట్ల ప్రవర్తిస్తున్న తీరు, అకృత్యాలను స్వయంగా ఆమె కుమారుడే బయటపెట్టిడట. సునీత విషయం వెలుగులోకి రావడానికి ఆయుష్మాన్ కారణమట. సునీతను తన తల్లి చిత్రహింసలకు గురిచేయడాన్ని చూసి భరించలేకపోయిన ఆయుష్మాన్.. ఈ విషయాన్ని తన స్నేహితుడైన ఓ ప్రభుత్వాధికారికి చెప్పి సునీతకు సాయం చేయాలని కోరాడట.