ఉక్రెయిన్పై రష్యా యుద్ధం సందర్భంగా బ్రతికుంటామో లేదోనన్న భయంతో ఉక్రెయిన్లో చాలా మంది ప్రేమికులు పెళ్లిళ్లు చేసుకున్నారు. పెళ్లి తర్వాత కొందరు యుద్ధానికి సిద్ధమైతే, మరికొందరు యుద్ధం వల్ల తమ పెళ్లిని వాయిదా వేసుకున్నారు. ఈ సందర్భంగా తాజాగా ఓ ఉక్రెయిన్ సైనికుడు యుద్ధం ముగిసిన తర్వాత తను ప్రేమించిన భారతీయ యువతిని వివాహం చేసుకుంటానని వెల్లడించాడు. తమ ప్రేమకు గుర్తుగా వేద మంత్రాలను తన గొంతు, ఛాతీ భాగాలపై పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. రష్యాతో యుద్ధం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తాను ప్రాణాలతో ఉంటే ప్రేమించిన యువతిని పెళ్లాడుతానని, ఆ తర్వాత జీవితాన్ని సంతోషంగా గడపాలనుకుంటున్నట్టు తెలిపాడు. పై విషయాన్ని గౌరవ్ సావంత్ అనే నెటిజన్ ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం వైరల్గా మారింది.
Love in The Time of War. A soldier (with an Indian connection, has Ved mantras tattooed on his throat & chest) wants to tie the knot in India after the war. Story coming up on @IndiaToday & @aajtak pic.twitter.com/pTLOof8X8Y
— GAURAV C SAWANT (@gauravcsawant) April 10, 2022