కశ్మీర్‌లోకి రానివ్వను! నువ్వెవడివిరా?.. పాకీ వర్సెస్ ఇండియన్ - MicTv.in - Telugu News
mictv telugu

కశ్మీర్‌లోకి రానివ్వను! నువ్వెవడివిరా?.. పాకీ వర్సెస్ ఇండియన్

September 16, 2019

Kashmir..

ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్తాన్ భారత్‌పై పీకలదాకా పగ పెంచుకున్నంత పనే చేస్తోంది. అవకాశం దొరికినప్పుడల్లా తన కడుపు మంటను భారత్‌పై విపరీత కామెంట్లతో తీర్చుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ భారతీయ వృద్ధురాలితో పాకిస్తాన్ యువకుడు గొడవ పెట్టుకున్నాడు. ఆమెను కశ్మీర్‌లోకి రానివ్వనని అడ్డుపడ్డాడు. ఆ వృద్ధురాలు మాత్రం అతని బెదిరింపులకు అస్సలు బెదిరిపోలేదు. అది నా దేశం.. ఎక్కడైనా తిరుగుతాను. అడగడానికి నువ్వెవరు? అంటూ అతనికి ధీటుగా సమాధానం చెప్పారు. ఈ ఘటన బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

భారతీయ కుటుంబం నిలుచున్న చోటికి వెళ్లిన సదరు పాకిస్తానీ యువకుడు కశ్మీర్ విషయంలో వాళ్లతో తగాదా పడ్డాడు. కశ్మీర్ వైపు ఎవరినీ రానివ్వనంటూ శపథాలు చేసిన అతని దుమ్ము దులిపింది ఆ వృద్ధురాలు. ‘కశ్మీర్ నా దేశంలో అంతర్భాగం. నాకు కావాల్సినప్పుడు వస్తాను, వెళ్తాను.. అడగడానికి నువ్వెవరు?’ అని సదరు యువకుడిపై విరుచుకుపడ్డారు. ఇంక ఆ తర్వాత ఆమెను ఏమీ అనలేక అక్కడినుంచి తోక ముడిచాడు ఆ యువకుడు. వెళ్తూ వెళ్తూ.. తన చివరి రక్తపు బొట్టు వరకు పోరాడుతానని చెప్పాడు.