పుట్టినరోజు నాడు జరుపుకునే వేడుకల్లో కేక్ కట్ చేసినందుకు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ క్షమాపణలు చెప్పారు. కరోనా లాక్డౌన్ సమయంలో దేశ ప్రజలంతా వైరస్ కట్టడికి నిబంధనలు పాటిస్తుంటే ప్రధాని మాత్రం వాటిని ఉల్లంఘించి 2020 జూన్ 10న పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. విషయం బయటకు పొక్కడంతో ఆయనపై విమర్శలు వచ్చాయి. ప్రతిపక్షాలు బోరిస్ రాజీనామా కోసం పట్టుబట్టాయి. అంతేకాక, ఈ చర్య ద్వారా పదవిలో ఉండగా చట్టాలను ఉల్లంఘించిన తొలి బ్రిటన్ ప్రధానిగా బోరిస్ చెడ్డపేరు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో బోరిస్ జాన్సన్ మాట్లాడుతూ బర్గ్ డే రోజు కేక్ కట్ చేయడం నిబంధనలు ఉల్లంఘించినట్టవుతుందని తనకు తోచలేదని వెల్లడించారు. ఇది చిన్న అతిక్రమణ, తెలియక జరిగింది అంటూ అందరికీ క్షమాపణలు చెప్పారు. దీనికోసం పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు