పీకే ఆ పని చేస్తే వెయ్యి కోట్ల మార్కెట్ చూపిస్తా.. బండ్ల గణేష్ ట్వీట్ - MicTv.in - Telugu News
mictv telugu

పీకే ఆ పని చేస్తే వెయ్యి కోట్ల మార్కెట్ చూపిస్తా.. బండ్ల గణేష్ ట్వీట్

September 30, 2022

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవన్ కల్యాణ్‌ని ఇష్టపడే వారిలో మొదటి వరుసలో ఉండే వ్యక్తి నటుడు కం నిర్మాత బండ్ల గణేష్ ఒకరు. పవన్ కల్యాణ్‌కి గబ్బర్ సింగ్ వంటి హిట్ సినిమాను ఇచ్చిన బండ్లన్న.. అవకాశం దొరికినప్పుడల్లా ఆయనను ఆకాశానికెత్తేస్తుంటాడు. తాజాగా ఆయన గురించి ట్వీట్ చేసి తన స్వామి భక్తిని చాటుకున్నాడు.

 

అంతేకాక, ఏకంగా పీకేకే ఆఫర్ ఇచ్చాడు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు చిత్రం చేస్తుండగా, ఆ సినిమా షూటింగ్ సందర్భంగా తీసిన ఓ ఫోటోను షేర్ చేస్తూ ఇలా ట్వీట్ చేశారు. ‘అబ్బబ్బ మా బాస్‌ను చూస్తుంటే గుండెల్లో దడ దడ మొదలయ్యింది. రక్తం ఉరకలేస్తుంది. ఇప్పుడు ఒక్క ఛాన్స్ వస్తే? వెయ్యి కోట్టు దాటే మార్కెట్ ఎట్లుంటడో చూపిస్తా. అబ్బ ముద్దొస్తున్నావ్ బాస్’ అని కామెంట్ చేశాడు.