ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన ప్రదీప్ మెహ్రాదికి ఆర్మీలో ఉద్యోగం సాధించేలా తనవంతు కృషి చేస్తానని.. రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ సతీశ్ దువా అన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మాట్లాడుతూ.. ”నోయిడా వీధుల్లో అర్ధరాత్రి పరిగెడుతూ, ఆర్ధిక స్తోమతల కారణంగా ఓ 19 ఏళ్ల యువకుడు (ప్రదీప్ మెహ్రా) తన కలను సాకారం చేసుకోలేని పరిస్థితులో ఉన్నాడు. కావున ఆ యువకుడికి శిక్షణ ఇప్పిస్తా. అతడిలోని ఆత్మవిశ్వాసం అద్భుతం. అతడు ఆర్మీ రిక్రూట్మెంట్ లో పాసయ్యేలా సాయం చేయాలనుకుంటున్నా. దీని గురించి ఇప్పటికే ఆర్మీ తూర్పు కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ రానా కలితాతో మాట్లాడాను. ఆ యువకుడి రిక్రూట్మెంట్ కోసం అవసరమైన శిక్షణ అందించడంలో రానా అతడికి సాయం చేస్తారు’ అని వెల్లడించారు.
Unmatched Dedication by this boy. @anandmahindra sir any ways we can help this boy. Truly inspired by this boy Excellent#dedication #Inspiration pic.twitter.com/vwSlCxFBM9
— Bhavin Gala (@bhavingala2) March 20, 2022
మరోపక్క ప్రదీప్ మెహ్రా చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో ఎంత వైరల్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ నేపథ్యంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా స్పందించారు. ఆ యువకుడి జీవితం ఆత్మ నిర్భరతకు ప్రతీక అని కొనియాడారు. “ఇది నిజంగా స్ఫూర్తిదాయకం. అయితే అతడి కథ నుంచి నేను పొందిన స్ఫూర్తి ఏంటో తెలుసా? ఆ యువకుడు ఎవరి మీదా ఆధారపడని వ్యక్తి. లిఫ్ట్ ఇస్తానన్నా వద్దన్నాడు. అతడికి ఎవరి అవసరం లేదు. అతడు ఆత్మ నిర్భరత కలిగిన వ్యక్తి” అని మహీంద్రా ట్విటర్లో పేర్కొన్నారు.