నరేష్‌కు విడాకులు ఇవ్వను..పెళ్లి జరగనివ్వను: మూడో భార్య రమ్య - MicTv.in - Telugu News
mictv telugu

నరేష్‌కు విడాకులు ఇవ్వను..పెళ్లి జరగనివ్వను: మూడో భార్య రమ్య

July 4, 2022

టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్, పవిత్ర లోకేష్‌ల వ్యవహారం రోజురోజుకు హాట్ టాఫిక్‌గా మారుతోంది. ఇప్పటికే మూడు పెళ్లిలు చేసుకున్న నటుడు నరేష్..తాజాగా పవిత్ర లోకేష్‌ను పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడు. దాంతో నరేష్ మూడో  భార్య రమ్య నరేష్‌పై తీవ్రంగా మండిపడుతూ, నరేష్, పవిత్రలు ఎక్కడెక్కడికి వెళ్తున్నారో ఆరా తీస్తుంది.

ఈ క్రమంలో ఆదివారం మైసూరులో నరేష్, పవిత్ర ఓ హోటల్లో ఒకే గదిలో ఉండగా, రమ్య అక్కడకు చేరుకుని వారిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న విషయం తెలిసిందే. గది నుంచి నరేష్, పవిత్రలు బయటికి వస్తున్న క్రమంలో చొప్పుతో కొట్టబోయింది. కానీ, అక్కడున్న పోలీసులు రమ్యను అడ్డుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఇప్పటికి వైరల్ అవుతూనే ఉన్నాయి.

అనంతరం రమ్య మీడియాతో మాట్లాడుతూ..” నరేష్‌తో నేనింకా విడాకులు తీసుకోలేదు. అయినా, కూడా పవిత్ర ఎందుకు నా భర్తతో కలిసి తిరుగుతోంది. నరేష్‌కు నేను విడాకులు ఇవ్వను. వాళ్లిద్దరి పెళ్లి జరగనివ్వను. ఎందుకంటే నరేష్‌ను నేను అందరిముందు పెళ్లి చేసుకున్నాను. నరేష్.. నన్ను కాదని నువ్వు మరో మహిళతో తిరగడం సరికాదు. నరేష్‌కు, పవిత్రకు పోలీసులు అండగా ఉండటం ఏంటీ?. వాళ్లిద్దరు ఎట్లా కలిసుంటారో నేను చూస్తా” అంటూ రమ్య శపథం చేశారు.