'నా పిల్లల జోలికొస్తే వదిలిపెట్టను': బెల్లంకొండ - MicTv.in - Telugu News
mictv telugu

‘నా పిల్లల జోలికొస్తే వదిలిపెట్టను’: బెల్లంకొండ

March 12, 2022

belam

టాలీవుడ్ నిర్మాత బెల్లంకొండ సురేశ్, ఆయన కొడుకు హీరో బెల్లంకొండ శ్రీనివాస్​పై బంజారాహిల్స్ సీసీఎస్​లో కేసు నమోదైన విషయం తెలిసిందే. బెల్లంకొండ సురేశ్​, శ్రీనివాస్​ తన దగ్గర డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వటం లేదని శ్రవణ్​కుమార్​ అనే వ్యాపారి నాంపల్లి కోర్టును ఆశ్రయించాడు. అయితే శనివారం బెల్లకొండ సురేష్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ”నన్ను నా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టేందుకు కొంతమంది పన్నిన కుట్రలో భాగమే నాపై కేసు నమోదైంది. నాకు శ్రవణ్ కూమార్ ఎలాంటి డబ్బు ఇవ్వలేదు. అయిన నాపై, నా కొడుకుపై కావాలనే కుట్ర చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. శ్రవణ్ నాకు డబ్బులు ఇచ్చినట్టుగా సాక్ష్యాలు ఉంటే పోలీసులకు ఇవ్వాలి. కానీ కోర్ట్‌ను ఆశ్రయించటం ఏంటీ. కొంతమంది శ్రవణ్‌తో కలిసి కుట్ర పన్నారు. నాకు డబ్బులు ఇచ్చినట్టు సాక్ష్యాలు బయటపెట్టకపోతే పరువునష్ట దావా వేస్తా” అని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

అంతేకాకుండా ‘నా పిల్లలు అంటే పంచ ప్రాణాలు. వారికి ఎవరితోనూ గొడవలు లేవు. అతడు నా కొడుకు జోలికి వచ్చాడు. అతన్ని లీగల్‌గా ఎదుర్కుంటాను. పరువు నష్టం దావా వేస్తాను. అతని వెనకాల ఎవరు ఉన్నారో కూడా నాకు తెలుసు. వాళ్ళను కూడా వదలను. 85 లక్షలు 2018లో ఇస్తే, ఇప్పుడు మేల్కొన్నారా. నాకు రూపాయి ఇచ్చిన మోహమా అతనిది. లీగల్‌గా అతనికి నరకం చూపిస్తా. ఇవి ఆవేశంతో కాదు బాధతో చెప్తున్న మాటలు. సాయి శ్రీనివాస్ ఇమేజ్ డ్యామేజ్ చేయడానికే అతను ఇలా చేస్తున్నాడు’ అని అన్నాడు.