ఎయిర్ క్రాఫ్ట్‌ను తాడుతో పట్టుకెళ్లిన హెలికాఫ్టర్  - MicTv.in - Telugu News
mictv telugu

ఎయిర్ క్రాఫ్ట్‌ను తాడుతో పట్టుకెళ్లిన హెలికాఫ్టర్ 

October 28, 2019

భారత వైమానిక దళం చేసిన పని అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. కూలిపోయిన ఎయిర్ క్రాఫ్ట్‌ను ఎంతో సాహసోపేతంగా వేరే ప్రాంతానికి తరలించారు. హెయిర్ క్రాఫ్ట్‌ను తరలిస్తున్న హెలికాఫ్టర్ వీడియోను చూసి మన ఐఏఎఫ్ సత్తాను ప్రశంసిస్తున్నారు. ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ దేవాలయం సమీపంలో ఇది జరిగింది. 

ఇటీవల ఓ పౌర విమానం కేదార్‌నాథ్ దేవాలయం సమీపంలోని హెలిఫ్యాడ్ వద్ద కుప్పకూలింది. దాన్ని పైకి తీసేందుకు అక్కడి అధికారులు ఐఏఎఫ్ సాయం కోరారు. ఈ నెల 26న ఎమ్‌ఐ-17, వీ5 అనే రెండు భారత వైమానిక దళ విమానాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. కూలిన విమానాన్ని హెలికాప్టర్‌కు కింది భాగాన కట్టి, అనంతరం దానిని పైకి తీసి డెహ్రడూన్‌లోని సహస్త్రధార ప్రాంతానికి చేర్చారు. ఇది ఐఏఎఫ్‌ నైపుణ్యతకు నిదర్శమని భారత వైమానికి దళ ప్రతినిధి పేర్కొన్నారు.