అమరవీరుడి తల్లిదండ్రుల ఔదార్యం.. పేదపిల్లల కోసం..  - MicTv.in - Telugu News
mictv telugu

అమరవీరుడి తల్లిదండ్రుల ఔదార్యం.. పేదపిల్లల కోసం.. 

November 18, 2019

IAF Jawan ....

తమకు దూరమైన కొడుకును మురికి వాడల్లో నివసించే పిల్లలో చూసుకొని జీవిస్తోంది ఓ అమర జవాను కుటుంబం. దేశం కోసం సేవల చేయాలనే అతని ఆశయాలు కొనసాగించేందుకు విద్యాబోధన చేస్తున్నారు. ఓ ట్రస్టు ఏర్పాటు చేసి దాని ద్వారా ఒకటి నుంచి ప్లస్ టూ వరకు 350 మంది విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్పిస్తున్నారు. వీరి కోసం 25 మంది వాలంటీర్లతో సేవలను కొనసాగిస్తున్నారు. 

శరత్ తివారీ, సవిత దంపతుల కొడుకు శశి తివారీ భారత వాయుసేలో పనిచేసేవాడు. 2017 అక్టోబర్ 6న జరిగి ఎంఐ17 వీ5 యుద్ధవిమానం అరుణాచల్ ప్రదేశ్‌లోని థవాంగ్ జిల్లాలో కూలిపోయింది. ఆ ప్రమాదంలో స్క్వాడ్రన్ లీడర్ శశి తివారీ మరణించాడు. అప్పటి నుంచి అతని ఆశయాల కోసం తల్లిదండ్రులు శరథ్ తివారీ పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేసి మురికి వాడల్లోని పిల్లలకు ఉచితంగా చదువు చెప్పిస్తున్నారు. ఆర్థిక కారణాలతో వారి బాల్యం చితికిపోకుండా విద్యా బోధన చెప్పించి వారిలో శశి తివారీని చూసుకుంటున్నట్టు ఆ దంపతులు చెబుతున్నారు. స్వచ్ఛంద సంస్థ కోసం కావాల్సిన ఆర్థిక సాయాన్ని స్నేహితులు, దాతల నుంచి సేకరిస్తూ పేద విద్యార్థులకు చదువు చెప్పిస్తున్నారు. వీరి స్పూర్తిని పలువురు అభినందిస్తున్నారు.