విమానాలు  జారే కాలం.. ఈసారి ముంబైలో - MicTv.in - Telugu News
mictv telugu

విమానాలు  జారే కాలం.. ఈసారి ముంబైలో

May 8, 2019

విమానాలు కూడా బస్సులు, రైళ్లు, కార్లలా మారిపోతున్నాయి. మాస్కో, దుబాయ్, అల్జీరియా.. దేశం ఏదైనా, ఎయిరిండియా, లుఫ్తాన్సా, ఎయిరేసియా.. కంపెనీ ఏదైనా తడబడిపోతున్నాయి. ముంబై విమానాశ్రయంలో భారత వైమానిక దళానికి చెందిన ఓ రవాణా విమానానికి ఈ రోజు భారీ ప్రమాదం తప్పింది. టేకాఫ్‌కు ముందు బయలుదేరిన విమానం ప్రధాన రన్‌వేపై వెళ్తుండగా ఉన్నట్టుండి పక్కకు జారిపోయింది. విమానంలో సాంకేతిక సమస్యతో ఈ ఘటన జరిగి ఉండొచ్చని విమానాశ్రయ అధికారులు భావిస్తున్నారు. విమానంలో వెళ్తున్న సిబ్బందికి ఎలాంటి ప్రమాదం జరగలేదని, వారు సురక్షితంగానే వున్నారని విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి.

దీంతో మిగతా విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని విమానాలు ఆలస్యంగా బయలు దేరినట్లు తెలిపారు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం తర్వాత దేశంలో అత్యంత రద్దీ విమానాశ్రయం ఇదే.