భారత వాయుసేన ఉప అధిపతి ఎయిర్ మార్షల్ శిరీష్ డియో ఆస్పత్రి పాలయ్యారు. పొరపాటున తన తొడలోకి తానే తుపాకీతో కాల్చుకుని తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అతణ్ణి ఢిల్లీలోని ఆర్ఆర్ ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని పేర్కొన్నారు.1979జూన్ 15న ఫైటర్ పైలట్‌గా శిరీష్ ఎయిర్ ఫోర్స్‌లో చేరారు. మిగ్-21 బైసన్ స్క్వాడ్రన్‌కు ఆయన ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్‌గా విధులు నిర్వర్తించారు. అత్యంత కీలకమైన ఒక ఫార్వర్డ్ బేస్‌కు చెందిన సిగ్నల్ యూనిట్‌కు కూడా చీఫ్ కమాండింగ్ ఆఫీసర్‌గా వ్యవహరించారు. స్టేషన్ కమాండర్‌గా ఎయిర్‌ఫోర్స్‌లోకి అధునాతన టెక్నాలజీని, సెన్సార్లను ఆయన తీసుకువచ్చారు. జూలైలో ఎయిర్ వైస్ చీఫ్‌గా శిరీష్ బాధ్యతలను స్వీకరించారు. ఎయిర్ చీఫ్‌గా బీఎస్ ధనోవా బాధ్యతలను స్వీకరించడంతో.. అప్పటిదాకా ఆయన నిర్వహించిన వైస్ చీఫ్ పదవిని శిరీష్ చేపట్టారు.