శ్రీదేవి కూతురు మూవీకి భారత వాయసేన బిగ్ షాక్.. - MicTv.in - Telugu News
mictv telugu

శ్రీదేవి కూతురు మూవీకి భారత వాయసేన బిగ్ షాక్..

August 12, 2020

IAF writes to Censor Board over its negative portrayal gunjan saxena movie.

దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ నటించిన ‘గుంజన్ సక్సేనా-ది కార్గిల్ గర్ల్’ సినిమా ఈ రోజు నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన సంగతి తెల్సిందే. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో మొట్టమొదటి మహిళా పైలెట్ గుంజన్ సక్సేనా జీవితం ఆధారంగా ఈ సినిమాను తీశారు. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నారు. యుద్ధంలో గాయపడిన సైనికులను రక్షించడంలోఆమె కీలక పాత్ర పోషించారు. కార్గిల్ లో ఆమె చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం శౌర్య వీర్ పురస్కారంతో సత్కరించింది.

ఈ సినిమాపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అభ్యంతరం తెలిపింది. ఎయిర్ ఫోర్స్ మీద నెగిటివ్ అభిప్రాయాన్ని కలిగించేలా ఈ సినిమా ఉందని సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్‌కు లేఖ రాసింది. ఈ లేఖను నెట్ ఫ్లిక్స్, ధర్మ ప్రొడక్షన్ హౌస్‌కు కూడా పంపింది. ఈ సినిమాను తీస్తున్నప్పుడు ఎయిర్ ఫోర్స్ గౌరవ మర్యాదలు పెంచేలా తీస్తామని చెప్పారు. కానీ, సినిమాలోని కొన్ని సన్నివేశాలు, సంభాషణలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ తమ దృష్టికి వచ్చిందని ఎయిర్ ఫోర్స్ అధికారులు తెలిపారు. గుంజన్ సక్సేనా పాత్రకు హైప్ తీసుకురావడం కోసం ఎయిర్ ఫోర్స్ పై నెగిటివ్ ప్రభావం వచ్చేలా తీసారని లేఖలో పేర్కొన్నారు. ఈ సినిమాలో లింగ భేదాన్ని చూపుతూ తీసిన సన్నివేశాలు అభ్యంతర కరంగా ఉన్నాయని, వాటిని తొలగించడం లేదా మార్చడం చేయాలని ఎయిర్ ఫోర్స్ అధికారులు సూచించారు.