కైగట్టి పాట పాడిన కలెక్టర్...! - MicTv.in - Telugu News
mictv telugu

కైగట్టి పాట పాడిన కలెక్టర్…!

August 16, 2017

ఆయన వృత్తి కలెక్టర్,ప్రవృత్తి మాత్రం  పాటలు పాడడం,మ్యూజిక్ కంపోజ్ చేయడం  ఆయనే ఆసిఫాబాద్ కలెక్టర్ చంపాలాల్.గిరిజనుల హక్కులకోసం పోరాటం చేసిన యోధుడు కొమురం భీమ్  పై ఈ కలెక్టర్ ఓ పాటను కైగట్టారు,ఓ వైపు కలెక్టర్ వృత్తిలో బిజిగా ఉంటూనే మరోవైపు తనలో ఉన్న కళాకారున్ని నిద్రలేపారు. ఆసిఫాబాద్ సంసృతీ సాంప్రదాయాల మీద అవగాహన పెంచుకొని వాటిని పాట రూపంలో తీసుకురావాలని స్వంతగా మ్యూజిక్ కంపోజ్ చేసి తనే ఓ పాట పాడారు…జయహో నవ చేతనమా-జనచేతన  నర్తనమా, అంటూ కలెక్టర్  పాడిన పాట ఇప్పుడు సోషల్ నెట్ వర్క్ లో హల్ చల్ చేస్తూ వైరల్ అయ్యింది.కలెక్టర్  చంపాలాల్  కొమురం భీం పై  పాడిన పాటను పంద్రాగస్ట్ వేడుకల్లో ఆవిష్కరించారు.ఇటు కలెక్టర్ గా ,అటు సంగీత ప్రావిణ్యుడుగా రొండు పాత్రలు పోషిస్తున్న చంపాలాల్ ని  అందరూ అభినందిస్తున్నారు.