IBOMMA has announced that completely shut down its operations in India from September 9th.
mictv telugu

యూజర్లకు బిగ్ షాక్.. iBOMMA మనకిక లేనట్లే..

September 5, 2022

తెలుగు సినిమా ప్రియులకు ఐబొమ్మ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఓటీటీలో విడుదలైన సినిమాలను హెచ్‌డీ క్వాలిటీ ఫ్రింట్‌తో ఉచితంగా అందిస్తోందీ వెబ్‌సైట్‌. ఓటీటీల్లో సినిమాలు చూడలేని వారు ఎంచెక్కా ఈ వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేసి తమకు నచ్చిన సినిమాలను చూసేస్తుంటారు. అయితే కొన్ని రోజుల క్రితం ఈ వెబ్‌సైట్‌ నిర్వహణ కష్టంగా ఉందని, తమపై అనవసర దుష్ర్పచారం చేస్తుండడంతో వెబ్‌సైట్‌ను షట్‌డౌన్‌ చేస్తున్నట్లు తెలిపింది ఐబొమ్మ. ఇంకో విషయం ఏంటంటే ఇప్పటి వరకు దాదాపుగా డిజిటల్‌ స్ట్రీమింగ్‌లో వచ్చిన సినిమాలు అన్నీ ఐ బొమ్మలో ఉండేవి. యూజర్లు సెర్చ్‌ ఆప్షన్‌లోకి వెళ్లి.. మరీ మనకు నచ్చిన సినిమాలు ఆన్‌లైన్‌లో లేదా డౌన్‌లోడ్‌ చేసుకుని చూసే అవకాశం ఉండేది. అయితే ఇప్పుడు అవకాశం లేదు. భారత యూజర్లు కేవలం వెబ్‌సైట్‌లో అప్లోడ్‌ చేసిన చివరి 30 సినిమాలు మాత్రమే చూడవచ్చని వెబ్‌సైట్‌ హోమ్‌ పేజీలో ఐ బొమ్మ ప్రకటించింది.

ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ చెప్పింది ఐ బొమ్మ. సెప్టెంబర్ 9 వ తేది నుంచి ఇండియాలో తమ ఆపరేషన్లను పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. మరోసారి తిరిగి వచ్చే ఆలోచన లేదని.. దయచేసి తమకు ఎవరూ మెయిల్ చేయవద్దని సూచించింది. తమపై ఇంత ప్రేమ చూపిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు తెలిపింది. ఇప్పటికే సినిమాలు డౌన్ లోడ్ కాకుండా ఆంక్షలు పెట్టిన ఐబొమ్మ.. మరో షాకింగ్ న్యూస్ చెప్పడంతో తెలుగు సినీ అభిమానులు ఆవేదన చెందుతున్నారు. ఈ నెల 9 న బింబిసార, సీతారామం ఓటీటీలో విడుదల కానుండడంతో.. ఐబొమ్మలో ఆ సినిమాలు ఉచితంగా చూసేద్దామనుకున్నారు. కానీ ఐబొమ్మ సంచలన ప్రకటనతో వారంతా నిరాశలో నిండిపోయారు.