నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 3517 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ - MicTv.in - Telugu News
mictv telugu

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 3517 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

October 27, 2020

 Employment

నిరుద్యోగులకు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) శుభవార్తను వినిపించింది. 3,517 పీవో పోస్టుల భర్తీకి సిద్ధమైంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. కెనరా బ్యాంక్  2,100, యుకో బ్యాంక్ 350,బ్యాంక్ ఆఫ్ ఇండియా 734, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 250, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్‌లో 83 పోస్టులను భర్తీ చేయనుంది. ఐబీపీఎస్ పీఓ ప్రిలిమినరీ ఎగ్జామ్ 2021 జనవరి 5, 6 తేదీల్లో జరుగుతుంది. పూర్తి వివరాలను https://www.ibps.in/  వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చని పేర్కొంది. గత ఆగస్టు 5 నుంచి 26 వరకు దరఖాస్తు చేసిన వారు మళ్లీ చేసుకోవాల్సిన పనిలేదని తెలిపింది. 

 

దరఖాస్తు వివరాలు  :

 

దరఖాస్తు తేదీ : 2020 అక్టోబర్ 28

చివరి తేదీ :  2020 నవంబర్ 11

ప్రిలిమినరీ ఎగ్జామ్ : 2021 జనవరి 5 లేదా 6

విద్యార్హతలు : ఏదైనా డిగ్రీ

వయస్సు : 20 నుంచి 30 ఏళ్లు

దరఖాస్తు ఫీజు : జనరల్ కేటగిరి రూ.850, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.175.