Ibrahimpatnam to. The cause of death is the same: Tamilisai
mictv telugu

ఇబ్రహీంపట్నం కు.ని. మరణాలకు కారణం అదే: తమిళిసై

September 4, 2022

తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటీవలే జరిగిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవరసం లేదు. ఆస్పత్రిలో జరిగిన కుటుంబ నియంత్రణ (కు.ని.) చికిత్సలు వికటించి, నలుగురు మహిళలు మృతిచెందారు. ఈ ఘటనతో అప్రమత్తమైన ఉన్నతాధికారులు..ముందస్తు చర్యల్లో భాగంగా ఇబ్రహీంపట్నం ఆసుపత్రిని తక్షణమే సస్పెన్షన్‌ చేసింది. ఆ తర్వాత సర్జరీ చేసిన వైద్యుడి లెసెన్స్‌ను తాత్కాలికంగా రద్దు చేయడమే కాకుండా, ఆ వైద్యుడిని సెస్పెండ్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని రోజులపాటు అన్నీ రకాల ఆపరేషన్లను నిలిపివేస్తూ, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఈ క్రమంలో నేడు తెలంగాణ గవర్నర్ తమిళిసై నేడు నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. అనంతరం మీడియాతో గవర్నర్ మాట్లాడుతూ.. ”ఇబ్రహీంపట్నం ఆసుపత్రిలో కు.ని ఆపరేషన్లు చేసిన ఆ డాక్టర్‌ లైసెస్స్‌ను తాత్కలికంగా రద్దు చేస్తూ, డాక్టర్‌ను సస్పెండ్ చేయడమనేది మామూలు విషయం కాదు. అంత ఆమోదయోగ్యం కూడా కాదు. దీనిపై విచారణ జరుగుతోంది. నివేదిక వచ్చాక పూర్తి కారణాలు తెలుస్తాయి. ప్రస్తుతం నిమ్స్‌లో జరిగే ట్రీట్మెంట్‌పై బాధితులు సంతృప్తిగా ఉన్నారు. బాధితులు ఆర్ధిక సహాయాన్ని కోరుతున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, ఆర్థిక సహాయం అందేలా చూస్తా. ఈ ఘటనకు ప్రధాన కారణం..ఎక్కువ ఆపరేషన్లు చేయాలని పెట్టుకున్న టార్గెట్‌ కారణంగానే ఈ ఘటన జరిగింది. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదు. దయచేసి డాక్టర్లు ఇలాంటి టార్గెట్స్ పెట్ఠుకొని, ఆపరేషన్లు చేయొద్దు” అని ఆమె అన్నారు.