ICC Men’s T20 World Cup 2022: BCCI announces India's squad. Check list here
mictv telugu

టీ20 వరల్డ్ కప్‌ 2022 టోర్నీకి జట్టును ప్రకటించిన బీసీసీఐ

September 12, 2022

అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలో జరగబోయే టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది బీసీసీఐ. గాయం కారణంగా ఆసియా కప్ 2022 టోర్నీకి దూరమైన జస్ప్రిత్ బుమ్రా టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కింది. దినేశ్ కార్తీక్‌కి టీ20 వరల్డ్ కప్‌లో వికెట్ కీపర్‌గా ఎంచుకున్న భారత జట్టు, రిషబ్ పంత్‌కి మరో అవకాశం ఇచ్చింది. మోకాలికి గాయం కావడంతో సర్జరీ చేయించుకున్న రవీంద్ర జడేజా టోర్నీకి దూరం కావడంతో అతడి స్థానంలో అక్షర్ పటేల్‌ను ఎంచుకున్నారు.

జ్వరంతో ఆసియా కప్ 2022 టోర్నీకి దూరమైన ఆవేశ్ ఖాన్‌ని టీ20 వరల్డ్ కప్ నుంచి తప్పించిన బీసీసీఐ సెలక్టర్లు, యంగ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ని పొట్టి ప్రపంచకప్ 2022 టోర్నీకి ఎంపిక చేశారు. సంజూ శాంసన్‌కి టీ20 వరల్డ్ కప్ 2022 జట్టులో చోటు కల్పించాలని అభిమానులు డిమాండ్ చేసినా, వాటిని పెద్దగా పట్టించుకోలేదు సెలక్టర్లు. అలాగే ఐపీఎల్ 2022 టోర్నీలో 150+ కి.మీ.ల వేగంతో నిప్పులు చెదిరే బంతులతో అదరగొట్టిన ఉమ్రాన్ మాలిక్‌ని కూడా పక్కన పెట్టేశారు.

టీ20 వరల్డ్ కప్ 2022 జట్టుకి భారత జట్టు ఇదే: రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్, హార్ధిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, యజ్వేంద్ర చాహాల్, అక్షర్ పటేల్, జస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్. వీరితో పాటు మహ్మద్ షమీ, శ్రేయాస్ అయ్యర్, రవి భిష్ణోయ్, దీపక్ చాహార్‌లక స్టాండ్ బై ప్లేయర్లుగా టీ20 వరల్డ్ కప్ 2022 జట్టులో చోటు కల్పించారు.