కరోనా ఎఫెక్ట్..వాయిదా దిశగా టీ20 వరల్డ్‌కప్ - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా ఎఫెక్ట్..వాయిదా దిశగా టీ20 వరల్డ్‌కప్

March 27, 2020

కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్, ఐపీఎల్ వాయిదా పడ్డ సంగతి తెల్సిందే. తాజాగా మరో మెగా టోర్నీ టీ20 ప్రపంచకప్‌ కూడా వాయిదా పడనున్నట్టు తెలుస్తోంది. ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది అక్టోబరు-నవంబర్ మాసాల్లో టీ20 ప్రపంచకప్‌ జరుగనుంది. అయితే దీనిని వచ్చే ఏడాది‌కి వాయిదా వేయాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ యోచిస్తున్నట్టు సమాచారం.

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌కి ఆతిథ్యమివ్వడంపై స్పష్టత ఇవ్వలేకపోతోంది. దీంతో ఏడాది పాటు ఈ టోర్నీని వాయిదా వేయనున్నారు. అయితే.. 2021 టీ20 వరల్డ్‌కప్ ఆతిథ్య హక్కులు ప్రస్తుతం భారత్ వద్ద ఉన్నాయి. దీంతో ఐసీసీ పెద్దలు బీసీసీఐ, క్రికెట్ ఆస్ట్రేలియా పెద్దలతో చర్చిస్తున్నారు. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.