టీమిండియా చరిత్ర సృష్టించింది. ఏక కాలంలో మూడు ఫార్మాట్లలలో నెం.1 స్థానాన్ని దక్కించుకుంది. ఐసీసీ తాజాగా విడుదల చేసి ర్యాంకింగ్స్ ప్రకారం వన్డే, టెస్ట్, టీ20ల్లో టాప్‌లో నిలిచింది. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో టీమిండియా వన్డే, టెస్ట్, టీ20ల్లో అగ్రస్థానాన్ని అందుకున్నా ఏక కాలంలో మూడు ఫార్మాట్లలో టాప్ ర్యాంక్ చేరడం ఇదే తొలిసారి.
2023లో న్యూజిలాండ్, శ్రీలంకలపై సత్తాచాటి వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని అందుకున్న టీమిండియా.. తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లోనూ అగ్రస్థానంకి చేరింది. తాజాగా ఆస్ట్రేలియాపై మొదటి టెస్ట్‌లో 132 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకొని పాయింట్ల పట్టికలో ముందుకు దూసుకెళ్లింది. టెస్ట్ ర్యాంకింగ్స్‌లో 115 రేటింగ్ పాయింట్స్‌తో టీమిండియా అగ్రస్థానంలో ఉండగా..ఆస్ట్రేలియా(111), ఇంగ్లండ్(106), న్యూజిలాండ్(100), సౌతాఫ్రికా(85) తర్వాతి స్థానంలో ఉన్నాయి. వన్డే ర్యాంకింగ్స్‌లో 114 పాయింట్లు, టీ20 ర్యాంకింగ్స్‌లో 267 రేటింగ్ పాయింట్స్‌తో టీమిండియా అగ్రస్థానంలో కొనసాగుతుంది.
వ్యక్తిగత ర్యాకింగ్స్‌లోనూ భారత ప్లేయర్స్ అదరగొట్టారు. టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో సూర్య మొదటిస్థానం నిలుపుకోగా..టెస్ట్‌ల్లో నెం.1 ఆల్‌రౌండర్‌గా జడేజా కొనసాగుతున్నాడు. వన్డేలో, నెంబర్ 1 బౌలర్‌గా సిరాజ్, టెస్ట్‌ల్లో నెంబర్ 2 బౌలర్‌గా అశ్విన్ ఉన్నారు. ఇక ఆస్ట్రేలియాపై సెంచరీ బాదిన రోహిత్ శర్మ టెస్ట్‌ల్లో టాప్ 10లోకి దూసుకొచ్చి 8వ స్థానంలో నిలిచాడు.