Home > Corona Updates > వాయిదా దిశగా టి20 వరల్డ్ కప్..ఐసీసీ ముందు 3 ఆప్షన్స్

వాయిదా దిశగా టి20 వరల్డ్ కప్..ఐసీసీ ముందు 3 ఆప్షన్స్

Icc

కరోనా కారణంగా ఎన్నో మెగా స్పోర్ట్స్ ఈవెంట్స్ రద్దు అవుతున్నాయి. ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్ వచ్చే సంత్సరానికి వాయిదా పడ్డ సంగతి తెల్సిందే. అలాగే భారత్ జరగాల్సిన ఐపీఎల్ టోర్నీ రద్దు అయింది. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియాలో ఈ ఏడాది అక్టోబర్, నవంబర్‌ మధ్యకాలంలో జరగాల్సిన ఐసీసీ టి20 వరల్డ్ కప్ సిరీస్ కూడా వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ నెల 28 జరగనున్న ఐసీసీ గవర్నింగ్ బాడీ మీటింగ్ లో టీ20 వరల్డ్ కప్ భవితవ్యంపై ఐసీసీ పెద్దలు ఓ నిర్ణయం తీసుకోనున్నారు. ఐసీసీ టి20 వరల్డ్ కప్ సిరీస్‌ గురించి ఐసీసీ పెద్దల ముందు మూడు ఆప్షన్స్ ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు తెలుపుతున్నారు. ఒకటి ఈ టోర్నీని 2022కు వాయిదా వేయడం. లేదా ఈ టోర్నీకి వచ్చే అన్ని దేశాల ఆటగాళ్లను ముందుగానే ఆస్ట్రేలియాకు తీసుకొచ్చి 14 రోజులు క్వారంటైన్‌లో ఉంచి ఆ తరువాత వారిని క్రికెట్ ఆడేందుకు అనుమతిస్తారని తెలుస్తోంది. లేదా ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్ లను నిర్వహించడం. ఈ మూడింటిలో ఐసీసీ ఏదో ఒక నిర్ణయం తీసుకోనుంది.

Updated : 15 May 2020 10:56 AM GMT
Tags:    
Next Story
Share it
Top