ఐసీసీ టీ-20 వరల్డ్ కప్ షెడ్యూల్ ఇదే.. - MicTv.in - Telugu News
mictv telugu

ఐసీసీ టీ-20 వరల్డ్ కప్ షెడ్యూల్ ఇదే..

November 4, 2019

ICC T20.

ఆస్ట్రేలియాలో జరిగే టీ – 20 వరల్డ్ కప్ పూర్తి షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసింది. 2020 అక్టోబర్ 18 సంవత్సరం నుంచి ప్రారంభంకానున్నాయి. నవంబర్ 15 వరకు దీన్ని నిర్వహించనున్నారు.  ఈసారి కొత్తగా చిన్నదేశాలకు కూడా ఈ టోర్నీలో చోటు లభించింది. మొత్తం 16 దేశాలు దీంట్లో పాల్గొననున్నాయి.  

ఈసారి కొత్తగా  పపువా న్యూగినియా, ఐర్లాండ్‌, ఒమన్‌, నెదర్లాండ్స్‌, నమీబియా, స్కాట్లాండ్‌ వంటి చిన్న దేశాలు చోటు సంపాధించుకున్నాయి. ఈ పసికూనలు టాప్-10 దేశాలతో కలిసి ఆడనున్నాయి. దీనికోసం టీంలను కొత్తగా రెండు గ్రూపులుగా విభజించారు. శ్రీలంక ఉన్న గ్రూప్‌-ఏలో పపువా న్యూగినియా, ఐర్లాండ్‌, ఒమన్‌ దేశాలు ఉండనున్నాయి. బంగ్లాదేశ్‌ ఉన్న గ్రూప్‌-బీలో నెదర్లాండ్స్‌, నమీబియా, స్కాట్లాండ్‌ ఉంటాయి. ఈ రెండు గ్రూపుల్లో అగ్రస్థానంలో నిలిచిన 2 జట్లు సూపర్‌-12 దశకు చేరుకుంటాయి.

సూపర్‌-12లో జట్లను గ్రూప్‌-1, గ్రూప్‌-2గా విభజించారు. గ్రూప్‌-ఏలో తొలిస్థానంలోని జట్టు, గ్రూప్‌-బిలో రెండో స్థానంలోని జట్టు సూపర్‌-12లో గ్రూప్‌-1లో చేరతాయి. ఇందులో పాకిస్థాన్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌ ఉంటాయి. ఇక గ్రూప్‌-బిలో తొలి జట్టు, గ్రూప్‌-ఏలో రెండో జట్టు సూపర్‌-12లో గ్రూప్‌-2లో చేరతాయి.