ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో మయాంక్‌ దూకుడు - MicTv.in - Telugu News
mictv telugu

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో మయాంక్‌ దూకుడు

November 26, 2019

ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్ట్ ర్యాంకింగ్స్ యువ ఆటగాడు మయాంక్ అగర్వాల్ అద్భుత ప్రదర్శన కనపరిచాడు. కేవలం 8 మ్యాచ్‌లు ఆడిన మయాంక్ టాప్-10 లోకి దూసుకొచ్చాడు. మయాంక్ ప్రస్తుతం పదో ర్యాంక్‌లో నిలిచాడు. బంగ్లాదేశ్‌తో తొలి డే నైట్ టెస్టులో సెంచరీతో చెలరేగిన భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు. 

టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్(931 రేటింగ్), రెండో స్థానంలో కొనసాగుతున్న కోహ్లీ(928) మధ్య కేవలం 3 పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది. టీమిండియా టెస్టు వైస్ కెప్టెన్ రహానె(759) ఐదో ర్యాంకు సాధించాడు. యువ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా ఐదో స్థానంలో నిలిచాడు. ఆల్‌రౌండర్ జాబితాలో జడేజా రెండు అశ్విన్ ఐదవ స్థానంలో నిలిచాడు. బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో రాణించిన పేసర్లు ఇషాంత్ శర్మ 17, ఉమేశ్ యాదవ్ 21వ స్థానాల్లో నిలిచారు.