ICC Twenty20 World Cup | Bangladesh edges Zimbabwe in last-ball thriller
mictv telugu

ఉత్కంఠభరిత మ్యాచ్‌లో జింబాబ్వేపై బంగ్లాదేశ్‌ విజయం

October 30, 2022

టీ20 ప్రపంచకప్లో మరో ఉత్కంఠభరితమైన మ్యాచ్ నమోదైంది. ఆఖరి వరకు ఊగిసలాట మధ్య సాగిన మ్యాచ్లో బంగ్లాదేశ్ కష్టంగా గెలిచింది. జింబాబ్వేపై 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ఓపెనర్ షాంటో(71) అద్భుతంగా రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. జింబాబ్వే బౌలర్లు ఎంగరవ(2), ముజరబాణి(2), రజా(1), సీన్ విలియమ్స్(1) వికెట్లు తీశారు.

151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే అద్భుత ప్రదర్శన చేసింది. మొదట తడబడినా ఆ తర్వాత స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది. ఆఖరి ఓవర్లలో ఒత్తిడికి గురైనా.. జింబాబ్వే టెయిలెండర్లు మ్యాచ్ను గెలుపు దిశగా తీసుకెళ్లారు. అయినా ఫలితం లేకపోయింది. 20వ ఓవర్లో చివరి బంతి నోబాల్ అయినప్పటికీ.. జింబాబ్వే విజయతీరానికి చేరలేకపోయింది. ఆ ఓవర్‌లో 6 పరుగులకు 16 కొట్టాల్సి ఉంది. క్రీజులో ర్యాన్‌ బర్ల్‌, నగరవ ఉండగా.. చివరి ఓవర్‌ను మొసద్దెక్‌ హొస్సేన్ వేశాడు. నగరవ రెండు బంతులను ఫోర్, సిక్సర్‌గా మలిచాడు. కానీ మరో బంతికి నగరవ ఔటయ్యాడు. ఇక ఒక బంతికి 5 పరుగులు రావాల్సి ఉంది. కానీ బ్యాటింగ్‌లో ముజరబానీ రావడంతో బంగ్లాదేశ్‌కు ఫలితంగా వచ్చింది. బౌలర్‌ చివరి బంతిని వేయగా.. ముజరబానీ ఔటయ్యాడు. కానీ ఆ బంతి నో బాల్‌గా తేలింది. మరో బంతి వేసినా బ్యాట్స్ మెన్‌ ఉపయోగించుకోలేకపోయాడు. జింబాబ్వే ఇన్నింగ్స్లో సీన్ విలియమ్స్(64) సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. చకబ్వా(15), రియాన్ బర్ల్(27) ఫర్వాలేదనిపించారు.