వరల్డ్ కప్‌ గెలిచేది ఆస్ట్రేలియానే.. గౌతమ్ గంభీర్ - MicTv.in - Telugu News
mictv telugu

వరల్డ్ కప్‌ గెలిచేది ఆస్ట్రేలియానే.. గౌతమ్ గంభీర్

May 19, 2019

ICC World Cup 2019 India and England my joint 2nd favourites, says Gautam Gambhir.

ప్రపంచకప్‌ పోరు మే 30న ఇంగ్లాండ్‌లో ప్రారంభం కానున్న సంగతి తెలిసందే. ఈ నేపథ్యంలో భారత మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్ కప్ జట్లలో తన ఫేవరెట్‌ జట్టు ఆస్ట్రేలియా అని తెలిపాడు. ఎందుకంటే ఆ జట్టు ఫైనల్‌ చేరుకునేందుకు సరైన పక్కా ప్లాన్‌తో బరిలోకి దిగుతుందన్నాడు.

ఫైనల్‌లో ఆ జట్టు ఇండియా లేదా ఇంగ్లాండ్‌తో తలపడాల్సి రావొచ్చు. ఆసీస్‌ జట్టు మాత్రం కచ్చితంగా ఫైనల్‌ వరకూ చేరుకుంటుందని జోస్యం చెప్పాడు. ఇండియా, ఇంగ్లాండ్‌ తన రెండో ఫేవరెట్‌ జట్లని.. ఈసారి గెలిచేది మాత్రం ఆస్ట్రేలియానే అని అన్నాడు. ప్రపంచకప్‌ టోర్నీలో భారత జట్టుకు బుమ్రా ఎక్స్‌ ఫ్యాక్టర్‌లా ఉపయోగపడతాడని పేర్కొన్నాడు. ‘ఇంగ్లాండ్‌ తన సొంతగడ్డపై ఆడుతుండటమే ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. అందులోనూ ఆ జట్టు మునుపటితో పోలిస్తే దృఢంగా కనిపిస్తోంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో సమతూకంగా ఉంది. దీంతో నెటిజన్లు గౌతమ్ గంభీర్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు.