ICC World Cup 2022: India wins the toss and opts to field first against Pakistan
mictv telugu

IND vs PAK T20: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రోహిత్ సేన

October 23, 2022

ప్రపంచ క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న….దాయాదుల మధ్య సమరానికి రంగం సిద్ధమైంది. టీ20 ప్రపంచకప్‌ సూపర్‌-12లో ఆదివారం టీమ్ఇండియా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో తలపడనుంది. గత ప్రపంచకప్‌లో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకోవాలని భారత జట్టు పట్టుదలతో ఉండగా.. మరోసారి రోహిత్‌ సేనకు షాక్‌ ఇవ్వాలని పాక్‌ భావిస్తోంది. తొలి మ్యాచ్‌లో విజయం సాధించి ప్రపంచ కప్‌ను ఘనంగా ఆరంభించాలని ఇరుజట్లు పట్టుదలగా ఉన్నాయి.

మెల్‌బోర్న్ వేదికగా మధ్య జరగుతోన్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రోహిత్ శర్మ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత్ ఏడుగురు బ్యాటర్లు, ఒక ఆల్‌రౌండర్, నలుగురు బౌలర్లతో బరిలోకి దిగుతోంది. వరల్డ్ క్రికెట్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించడం కోసం దాదాపు లక్ష మంది రావడంతో.. మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియం ప్రేక్షకులతో నిండిపోయింది. టీ20ల్లో భారత్, పాకిస్థాన్ ఇప్పటి వరకూ 11 సార్లు తలపడగా.. భారత్ 8సార్లు, పాక్ మూడుసార్లు విజయం సాధించాయి.

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అర్షదీప్ సింగ్.

పాకిస్థాన్ జట్టు: బాబర్ ఆజమ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), షాన్ మసూద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, హైదర్ అలీ, ఇఫ్తికర్ అహ్మద్, అసిఫ్ అలీ, నసీమ్ షా, హరీస్ రవూఫ్, షాహీన్ అఫ్రిదీ.