కూల్ కూల్ విషం..వాటిని తిన్నారో... - MicTv.in - Telugu News
mictv telugu

కూల్ కూల్ విషం..వాటిని తిన్నారో…

June 7, 2017

హాట్ హాట్ సమ్మర్ లో… ఐస్ క్రీమ్ కనిపించిందంటే కూల్ కూల్ గా తినేయాలనిపిస్తుంది. గల్లీల్లో బెల్ మోగిందంటే బండి దగ్గరకు పిల్లలు ఒకటే పరుగుతీస్తారు.ఐస్ క్రీమ్ కొని తీనేదాకా ఆగారు. కానీ ఈ వాస్తవాలు తెలిస్తే ఎక్కడపడితే అక్కడ ఐస్ క్రీమ్ తినాలంటేనే భయపడుతారు. ఎందుకంటే..

ఏడ్చే పిల్లలు చల్ల చల్లని ఐస్ క్రీమ్ చూస్తే ఐస్ అయిపోతారు. ఒకటి రెండు తినేదాకా ఆగరు. సమ్మర్ లోనైతే మరి ఎక్కువ తినేస్తుంటారు. పిల్లలే కాదుపెద్దలు ఐస్ క్రీం పార్లర్ కనిపిస్తే చాలు లొట్టలేసుకుంటూ వెళ్తారు. లీటర్ల కొద్ది ఫ్యామిలీ ప్యాక్ లు ఇళ్లకు తీసుకెళ్తుంటారు. ఇక ప్రతి ఫంక్షన్ లో కంపల్సరీ. కానీ ఈ కూల్ కూల్ ఐస్ క్రీం వెనుక విస్తుగోల్పే నిజాలు దాగి ఉన్నాయి. ఇందులో వాడే వాటర్ గురించి తెలిస్తే యాక్ థూ అంటారు. కలుషీతమైన బోర్ వాటర్ ను ఉపయోగిస్తున్నారు. కెమికల్స్ టుమచ్ గా వాడేస్తున్నారు.

సికింద్రాబాద్ పరిధిలోని లాలాపేటలోఐస్‌క్రీమ్ తయారీ కేంద్రంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడిచేశారు. ఈ సోదాల్లో పోలీసులు కలుషిత నీరు, రసాయనాలతో ఐస్‌క్రీమ్‌లు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో రసాయనాలు, ఐస్‌క్రీమ్‌లను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు.

ఇలా ఈ ఒక్కచోటే కాదు.. చాలా ప్రాంతాల్లో ఇలాగే జరుగుతోంది. ఎలాగూ తయారు చేస్తున్నప్పుడు ఎవరు చూడరు కాదా అని ఐస్ క్రీం తయారీదారులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. ప్రజల ఆరోగ్యం గురించి అసలు పట్టించుకోవట్లేదు..టాస్క్ ఫోర్స్ పోలీసులు..ఫుడ్ ఇన్సెపెక్టర్లూ ఇలా ఒక్క ప్రాంతంలోనేకాదు..అన్నిచోట్ల తనిఖీలు చేయండి…అప్పుడే వాళ్లు మారుతారు.