ఫ్రిజ్‌లో ప్రత్యక్షమైన శివుడు.. ఊరంతా అక్కడే! - MicTv.in - Telugu News
mictv telugu

ఫ్రిజ్‌లో ప్రత్యక్షమైన శివుడు.. ఊరంతా అక్కడే!

December 12, 2017

కశ్మీర్‌లోని అమర్‌నాథ్ పుణ్యక్షేత్రం గురించి మనకు తెలిసిందే. అక్కడ ఏర్పడే మంచు శివలింగాన్ని దర్శించుకుని ధన్యులు కావడానికి జనం క్యూ కడుతుంటారు. ఇప్పుడు ఈరోడ్ జిల్లా చిన్నమలైకి కూడా క్యూ కడుతున్నారు. అక్కడ కూడా హిమలింగం ప్రత్యక్షమైంది. దాన్ని చూడ్డానికి జనం తండోపతండాలుగా వస్తున్నారు. పిడారియూర్‌ గ్రామానికి చెందిన కుమార్‌ శివభక్తుడు. ఇటీవల కాస్తా సంపాదించి కొత్త ఇల్లు కట్టుకున్నాడు. గృహప్రవేశం జరిగింది.  పాత నుంచి కొత్త ఇంటికి సామాన్లు తీసుకొస్తున్నారు. ఫ్రిజ్‌లోని వస్తువులను ఖాళీ చేసి దాన్ని కూడా తరలిద్దామని అనుకున్నారు. ఫ్రీజర్‌ బాక్స్‌లో ఏమున్నాయో అని చూడగా పరమశివుడు కనిపించాడు.  శివలింగం రూపంలో ఐస్‌ అర అడుగు ఎత్తున కట్టిపోయింది. దీంతో శివుడే తమను అలా దీవించాడని కుమార్ సంబరపడిపోయాడు.  ఫ్రిజ్‌ను పాత ఇంట్లోనే ఉంచాడు. ఈ సంగతి ఊరంగా పాకిపోయింది. జనం వెల్లువెత్తారు. శివలింగానికి పూలదండలు, వేసి కర్పూర హారతులు ఇస్తున్నారు. తాను శివభక్తుడినని, అందుకే తన దేవుడు ఇలా కనిపించాడని కుమార్ చెబుతున్నాడు.