ICET Counseling Schedule Released by Telangana Govt
mictv telugu

ఐసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

September 19, 2022

తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు సంబంధించి నిర్వహించే ఐసెట్ కౌన్సిలింగ్ షెడ్యూలును రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సాయంత్రం విడుదల చేసింది. అక్టోబర్ 10 నుంచి కౌన్సిలింగ్ ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. అక్టోబర్ 13 వరకు సర్టిఫికెట్ల పరిశీలన, అక్టోబర్ 15 వరకు వెబ్ ఆప్షన్లను ఎంచుకునే అవకాశం కల్పించారు. తర్వాత 18న తొలి విడత సీట్ల కేటాయింపు జరుగనుంది. తుది విడల కౌన్సిలింగ్ అక్టోబర్ 23 నుంచి ప్రారంభం కానుంది. అందులో భాగంగా వెబ్ ఆప్షన్లు ఇచ్చేందుకు అక్టోబర్ 25 వరకు గడువు విధించారు. అక్టోబర్ 28న తుది విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. అంటే రెండు విడతల్లో జరిగే కౌన్సిలింగ్ పక్రియ అక్టోబర్ 10న ప్రారంభమై అదే నెల 28న ముగుస్తుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.