ICF Recruitment: రాత పరీక్షలేకుండానే కోచ్ ఫ్యాక్టరీలో స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు..!! - Telugu News - Mic tv
mictv telugu

ICF Recruitment: రాత పరీక్షలేకుండానే కోచ్ ఫ్యాక్టరీలో స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు..!!

February 19, 2023

ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (Integral Coach Factory Recruitment 2023) స్పోర్ట్స్ కోటాలో పలు పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. చెన్నైలో ఉన్న ఈ సంస్థలో ఖాళీలు భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతోంది. స్పోర్ట్స్ కోటాలో లెవెల్ 1 ఉద్యోగాలకు గానూ ఈ నోటిఫికేషర్ ప్రకటించింది. దీనిలో భాగంగా ప్రతిభగల క్రీడాకారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ. ఖాళీలు, అర్హతలు వంటి పూర్తి వివరాలు తెలసుకుందాం.

-నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 15ఖాళీలను భర్తీ చేయనున్నారు.

-ఫుట్ బాల్ ( పురుషులు) బాడీ బిల్డింగ్ ( పురుషులు), కబడ్డీ, హాకీ, క్రికెట్, వెయిట్ లిఫ్టింగ్ వీటిలో అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

-ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదవ తరగతి, ఐటీఐ ఉత్తీర్ణతోపాటు వివిధ క్రీడాంశాల్లో క్రీడాకారులై ఉండాలి.-

– ఆసక్తితోపాటు అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

-అభ్యర్థులను ట్రయల్, ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్ట్ చేస్తారు.

-దరఖాస్తులను అసిస్టెంట్ పర్సనల్ ఆఫీసర్ లేదా రిక్రూట్ మెంట్, ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, చెన్నై అడ్రస్సుకు పంపించాలి.

-ట్రయల్స్ ను మార్చి 28,29తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ గడువు మార్చి 13వ తేదీతో ముగుస్తుంది.

ముఖ్య విషయాలు:

కండక్టింగ్ బాడీ                         ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ
పోస్ట్‌లు                                    వివిధ పోస్ట్‌లు
ఖాళీ                                               10
వర్గం                                        ప్రభుత్వ ఉద్యోగం
ఉద్యోగ                                      స్థానం చెన్నై
అధికారిక వెబ్‌సైట్              https://pb.icf.gov.in/

మరింత సమాచారం కోసం అధికారిక వెబ్ సైట్ https://pb.icf.gov.in/  చెక్ చేసుకోవచ్చు.