వావ్... సాలరీ అకౌంట్లు ఉన్నోళ్లకు 15 లక్షల లోన్..! - MicTv.in - Telugu News
mictv telugu

వావ్… సాలరీ అకౌంట్లు ఉన్నోళ్లకు 15 లక్షల లోన్..!

July 20, 2017

మీరు ఐసీఐసీఐ బ్యాంకులో సాలరీ హోల్డరా..డబ్బుల కోసం ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు..లోన్ల కోసం బ్యాంకు చుట్టూ చక్కర్లు కొట్టాల్సిన పనిలేదు..జస్ట్ ఏటీ ఎం ద్వారానే లోన్ తీసుకోవచ్చు..ఎంతో తెలుసా 15 లక్షల దాకా..

సాలరీ అకౌంట్లు ఉన్నోళ్లు ఇకపై ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎంల నుంచే పర్సనల్ లోన్స్ పొందవచ్చు. ఒక్కో ఖాతాదారు అర్హతనుబట్టి రూ.15 లక్షల వరకు రుణాన్ని తక్షణమే పొందే చాన్స్ ఉంది. పూలమాల వంటి సదుపాయాన్ని ఖాతాదారులకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఐసీఐసీఐ బ్యాంకు తెలిపింది.

తమ బ్యాంకు ఏటీఎంలలో రుణ దరఖాస్తులను సులభమైన విధానంలో పరిష్కరించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఐసీఐసీఐ బ్యాంకు ప్రకటించింది. సిబిల్ స్కోరు ప్రకారం అర్హతలను ముందుగానే నిర్ణయిస్తామని తెలిపింది. అర్హతనుబట్టి వివిధ రుణ మొత్తాల నుంచి తమకు నచ్చిన సొమ్మును ఎంపిక చేసుకోవచ్చునని, గరిష్ఠంగా రూ.15 లక్షల వరకు రుణం పొందవచ్చునని తెలిపింది. కస్టమర్ ఎంపిక చేసుకున్న సొమ్ము తక్షణమే ఆ కస్టమర్ ఖాతాలో జమ అవుతుందని వివరించింది. 60 నెలల నియమిత కాలంలో తిరిగి చెల్లించేందుకు వీలుగా ఈ రుణాన్ని అందజేస్తామని ఐసీఐసీఐ వెల్లడించింది.