ICICI ఖాతాదారులకు గుడ్ న్యూస్.. వాట్సాప్‌లోనూ బ్యాంక్ సేవలు  - MicTv.in - Telugu News
mictv telugu

ICICI ఖాతాదారులకు గుడ్ న్యూస్.. వాట్సాప్‌లోనూ బ్యాంక్ సేవలు 

March 31, 2020

ICICI Launches WhatsApp Banking

లాక్ డౌన్ కారణంగా చాలా మంది బ్యాంకు సేవలకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.  దీన్ని గమనించిన ICICI బ్యాంకు తన ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి ఎవరూ బ్యాంక్‌కు వెళ్లకుండా ఇంట్లో ఉండే సేవలను వినియోగించుకునే సౌకర్యం కల్పించింది. వాట్సాప్ ద్వారానే తమ సర్వీసులను అందుబాటులోకి తెచ్చినట్టు ప్రకటించింది. వినియోగదారులు ప్రతిసారి తమ బ్యాంకులకు వస్తే వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని భావించి ఈ కొత్త నిర్ణయం తీసుకున్నట్టుగా వెల్లడించారు.

దీని కోసం ఖాతాదారులు చేయాల్సిందల్లా బ్యాంక్ ఖాతాతో రిజిస్టర్ చేసిన ఫోన్ నంబర్ నుంచి 93249 53001కు వాట్సాప్ నుంచి హాయ్ అని మెసేజ్ పంపాలి. ఆ వెంటనే ఖాతాలో బ్యాలెన్స్,క్రెడిట్,డెబిట్ కార్డ్ వివరాలు, తక్షణ లోన్, కార్డులు బ్లాక్ అండ్ అన్ బ్లాక్,స్టేట్ మెంట్ వంటి సర్వీసులకు సంబంధించిన వివరాలు వస్తాయి. అందులో కావాల్సిన ఆఫ్షన్ ఎంపిక చేసుకుంటే దానికి సంబంధించిన వివరాలు వస్తాయి. ఇలా చేయడం ద్వారా చిన్న చిన్న పనులకు కూడా తరుచూ బ్యాంకులకు వచ్చే వారిని తగ్గించుకోవచ్చని ఆ సంస్థ ఈ సరికొత్త సేవలను అందుబాటులోకి తెచ్చినట్టు ప్రకటించింది. ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ వాట్సాప్ వాడుతున్నందున ఈ సేవలు మెరుగైన ఫలితాలను అందిస్తుందని ఐసీఐసీఐ భావిస్తోంది.