ప్లాస్మా థెరపీపై ఐసీఎంఆర్ సంచలన వ్యాఖ్యలు - MicTv.in - Telugu News
mictv telugu

ప్లాస్మా థెరపీపై ఐసీఎంఆర్ సంచలన వ్యాఖ్యలు

September 16, 2020

plasama

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ కి వ్యాక్సిన్ లేదన్న సంగతి తెల్సిందే. కానీ, ప్రస్తుతం ఉన్న మందులతో కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నారు. అలాగే కరోనా నుంచి కోలుకున్నవారి ప్లాస్మాతో కూడా చికిత్స అందిస్తున్నారు. అందు కోసం దేశవ్యాప్తంగా ప్లాస్మా బ్యాంకు లను ఏర్పాటు చేశారు. కరోనా నుంచి కోలుకున్న వారి నుంచి ప్లాస్మాను సేకరించి ఈ థెరపీ ద్వారా చికిత్స అందిస్తున్నారు. అయితే దీనిపై తాజాగా భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) సంచలన వ్యాఖ్యలు చేసింది. 

14 రాష్ట్రాల్లోని 39 ఆసుపత్రుల్లో 469 మంది బాధితులపై చేసిన అధ్యయనంలో ఆందోళనకర విషయాలు వెల్లడయ్యాయని ఐసీఎంఆర్ తెలిపింది. కరోనా మరణాలను ప్లాస్మా థెరపీ తగ్గించలేకపోయిందని ఈ అధ్యయనంలో తేలిందని తెలిపింది. ప్లాస్మా థెరపీ మరణాలతో పాటు రోగ తీవ్రతను కూడా ఇది తగ్గించలేకపోయిందని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ పేర్కొన్నారు. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్‌తో కలిసి నిన్న నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని తెలిపారు. ప్లాస్మా థెరపీపై శాస్త్రవేత్తల సమీక్ష కొనసాగుతోంది. సమీక్ష పూర్తయిన తరువాత ప్లాస్మా థెరపీని కొనసాగించాలా? లేదా? అనేది నిర్ణయించనున్నారు.