నిఖిల్ సిద్ధార్థ్ తాజా చిత్రం ‘18 పేజీస్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. దీనికి అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించింది. కార్తికేయ 2 సూపర్ సక్సెస్ తర్వాత నిఖిల్‌తో ఆమె రెండవసారి కలిసి నటించింది. ఈ చిత్రానికి పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించగా.. దర్శకుడు సుకుమార్ కథని అందించాడు. ఇక ఈ చిత్రాన్నీ అల్లు అర్జున్ సన్నిహితుడు బన్నీ వాసు గీతా ఆర్ట్స్2 బ్యానర్ పై నిర్మించాడు. ’18 పేజీస్’ డిసెంబర్ 23న విడుదల కానుండగా.. సుకుమార్ టీమ్ నుండి వస్తున్న మూవీ కావటంతో మార్కెట్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక తన డ్యాన్స్, స్టైల్స్ తో సౌత్ లో ఐకాన్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న బన్నీ.. పుష్ప మూవీతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. పుష్ప క్యారెక్టరైజేషన్, గెటప్, మ్యానరిజమ్స్ కి ఆడియన్స్ ఫిదా అయిపోయారు.
ఇక పుష్పతో తనకి వచ్చిన పేరు అంతా దర్శకుడు సుకుమార్ కృషే అంటూ ఎమోషనల్ అయ్యాడు బన్నీ. టాలీవుడ్ లో ఆర్యతో తోలి బ్రేక్ ఇచ్చిన సుకుమార్ పుష్పతో బన్నీకి బాలీవుడ్ లో ఫస్ట్ హిట్ ఇచ్చాడు. తన జీవితంలోని ఈ రెండు ప్రధాన ఘట్టాలకు సుకుమార్ కారణం కావటంతో స్టేజిపై బన్నీ భావోద్వేగంతో మాట్లాడగా.. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్బంగా.. అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘‘ ‘18 పేజీస్’ సినిమాను నాకెంతో ఇష్టమైన వ్యక్తులు కలిసి చేస్తున్నారు. ఈ సినిమా నిర్మాత అయిన సుకుమార్.. నా డైరెక్టర్, నా ఫ్రెండ్, నా శ్రేయోభిలాషి. ఆయన నా హృదయానికి ఎంతో దగ్గరైన వ్యక్తి. సుకుమార్ లేకపోతే నా లైఫ్, ప్రయాణం ఇలా ఉండేది కాదు అని ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను. ఈ రోజు నేను ఇక్కడ ఇలా ఉండటానికి ఆయన చాలా ముఖ్యమైన వ్యక్తి. ఆయనపై నాకున్న లవ్, రెస్పెక్ట్, గ్రాట్యిట్యూడ్ ప్రతీది కారణం’’ అన్నారు. అలాగే ‘ఈ చిత్ర నిర్మాత బన్నీ వాసు. ఈయన నా పేరునే పెట్టుకున్నాడు. వాసుని క్లోజ్ ఫ్రెండ్ అనాలో, గైడ్ అనాలో అర్ధం కాదు. నాకు ఇష్టమైన ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ చేస్తున్న ఈ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటున్న’ అంటూ అల్లు అర్జున్ ఎమోషనల్ అయ్యాడు.
ఇవి కూడా చదవండి :
1.నాగార్జున కి బిగ్ షాక్.. హోస్టుగా బాలకృష్ణ ?
2.‘పోలీసు ఉన్నతాధికారులు గవర్నమెంట్‌కు తొత్తులుగా మారారు’
3.భర్త కూతురి ముందే కిస్.. ఐశ్వర్య రణవీర్ ల పబ్లిక్ రొమాన్స్ వీడియో లీక్