Iconic indo western saree drapping styles
mictv telugu

ఆధునికత తోడై ఆకట్టుకొనేలా చీరకట్టు!

November 15, 2022

Iconic indo western saree drapping styles

ఆరుగజాల చీర 5వేల సంవత్సరాల నుంచి ఆడవాళ్ల వార్డ్రోబ్ని ఆక్రమించేసింది. భారతదేశంలోనే కాదు.. దేశ దేశాల్లోనూ చీరకున్న ఆదరణ అంతా ఇంతా కాదు. అందుకే ఒకే కట్టుతో ఎందుకని వివిధ రకాలుగా కట్టి చూపిస్తున్నారు ఫ్యాషనిస్టులు. అందులో కొన్నిఇండో వెస్ట్రన్ లుక్తో అదిరిపోయే చీరకట్టు మీకోసం..

మొదటిసారి చీర కట్టినా.. నూటొక్కటోసారి చీర చుట్టినా చీరలో ఉండే గ్రేసే వేరు. అందుకే ఎన్ని మోడ్రన్ డ్రెస్లు వచ్చినా కొన్ని సందర్భాల్లో మాత్రం చీర కట్టే అందం. అందుకే పండు ముసలి నుంచి పదహారేండ్ల అమ్మాయిల దాకా చీర కట్టును మించింది లేదంటున్నారు. అయితే ఈ చీరను ఒకేలా కడితే కొత్తముందేమనుకున్నారేమో.. అందుకే దాన్ని రకరకాలుగా కట్టి ముచ్చట తీర్చుకుంటున్నారు మగువలు. పెండ్లిళ్లు, పార్టీలు, ఫంక్షన్లు ఒక్కటేమిటి వివిధ అకేషన్లలో ఇలా చీరట్టుతో మెరిసిపోండి.

భుజాలపై జారుగా..

మన లిస్ట్లో ఈ ఆఫ్ షోల్డర్ కట్టు ఉంటుంది. ఈ స్టయిల్ కాలేజీకి, పార్టీలకు వెళ్లే అమ్మాయిలకు బాగా నచ్చుతుంది. పైగా పెద్ద పెద్ద నగలతో అందం మరింత రెట్టించాలంటే ఈ చీరకట్టు కట్టాల్సిందే! దీనికోసం ముందుగా మామూలు చీర కట్టునే కట్టాలి. కాకపోతే పల్లూని ఎక్కువగా వదిలేయాలి. ఇప్పుడ ఆ పల్లూని చిన్నగా మడిచి భుజాల చుట్టూ జారుగా ఉంచి మిగిలిన కొంగును నడుము చుట్టూ చుట్టాలి. నడుముకి చిన్న బెల్ట్ పెడితే లుక్ అదిరిపోతుంది.

Iconic indo western saree drapping styles

చేపకట్టుతో..

సాగరకన్యలా మెరిసిపోవాలంటే ఏ అమ్మాయి అయినా ఈ చీర కట్టుతో మెరువాల్సిందే! ఇందులో కుచ్చిళ్లు, పల్లూని డిఫరెంట్గా కట్టాల్సి ఉంటుంది. కుచ్చిళ్లను చిన్నగా చుట్టాలి. ఆ తర్వాత కొంత కింద భాగాన్ని వదిలేసి ఆ పై నుంచి చీర చుట్టాలి. ఆ తర్వాత పల్లూని కూడా అదేవిధంగా చిన్నగా వేయాలి. అయితే ఈ చీరకట్టును ఇప్పుడు డ్రెస్ మాదిరిగా కుట్టి వేసుకోవడం కూడా ఒక ట్రెండ్ అయిపోయింది.

Iconic indo western saree drapping styles

భలే బెంగాలీ..

హిందీ దేవదాసు సినిమాలో ఐశ్వర్యరాయ్ చీర కట్టు గుర్తుందా?అది సంప్రదాయ పద్ధతిలో బెంగాలీ చీర కట్టు. దాన్ని కాస్త మోడ్రన్ టచ్ చేసి కట్టేదే ఈ బెంగాలీ చీర కట్టు. ముందుగా చీరను నడుము చుట్టూ బిగించాలి. ఇందులో పల్లూ వేయడమే ప్రధాన ఆకర్షణ. అందుకే పెద్దగా ఈ పల్లూని వదిలేయాలి. నడుము చుట్టిన తర్వాత ఎడమ భుజం నుంచి కొంగును వేసి దాన్ని కుడి భుజం నుంచి ముందుకు సన్నగా మడిచి వదిలేయాలి. చీర కొంగు అంచులకు తాళాల గుత్తిని వేలాడదీసి చూడండి. ఈ చీరకట్టులో నగలు మీ అందాన్ని రెట్టింపు చేయడం ఖాయం.

అనంతమే అందం..

గుజరాతీ స్టయిల్ ఆదర్శంగా తీసుకొని ఈ చీర కట్టును చుట్టాల్సి ఉంటుంది. ఈ చీరకట్టుకి ప్లెయిన్ చీరలు బాగుంటాయి. చీర కట్టాలంటే వీళైనన్ని కుచ్చిళ్లు ఎక్కువ వచ్చేలా చిన్నగా కట్టాలి. అలాగే కొంగు కూడా పెద్దగా పెట్టాలి. ఈ కొంగును కూడా కుచ్చిళ్ల మాదిరిగా వచ్చేలా చుట్టి నడుము దగ్గర చెక్కాలి. కనీసం కొంగు దగ్గర ఎంత అందంగా సెట్ చేస్తే ఈ కట్టు మరింత అందంగా కనిపిస్తుంది.

Iconic indo western saree drapping styles

చిందరవందరగా..

కొన్నిసార్లు నీట్గా కడితే ఆ లుక్ రాదు. అదే కొంగును జిగ్జాగ్గా చుడితే సూపర్ అంటున్నారు ఫ్యాషనిస్టులు. ముఖ్యంగా ఈ లుక్ కోసం కంచి పట్టు చీరలు, పెద్ద పెద్ద బార్డర్ ఉన్న చీరల్ని ఎంచుకుంటే మరింత అందంగా ఉంటారట. ఈ కట్టు కోసం మామూలుగానే చీరను చుట్టేయాల్సి ఉంటుంది. కేవలం కొంగును కాస్త డిఫరెంట్గా మడవాలి. వెనుక వైపు కొంగు వేయకుండా ముందు భాగంలోనే చీరను చిన్న చిన్నగా మడిచి భుజం దగ్గర పిన్ పెడితే సరిపోతుంది.

Iconic indo western saree drapping styles