ID Fresh company making employees millionaires
mictv telugu

ఉద్యోగులను కోటీశ్వరులను చేస్తున్న సంస్థ.. ఇప్పటివరకు 300 కోట్లు

July 7, 2022

ఏ సంస్థ అయినా ఉద్యోగుల నుంచి గరిష్ట స్థాయిలో పనిని రాబట్టి అందుకు కొంత తక్కువ డబ్బును జీతంగా ఇస్తుంది. కంపెనీ లాభాలార్జించాలంటే ఈ మాత్రం తప్పనిసరి అని దాదాపు అన్ని కంపెనీలు ఆలోచిస్తాయి. కానీ, వీటన్నింటికీ భిన్నంగా ఆలోచించింది ఐడీ ఫ్రెష్ అనే కంపెనీ. రెడీ టు కుక్ పేరుతో దోశ పిండి, రాగి ఇడ్లీ, బియ్యం, గోధుమ పరోటా, మలబార్ పరోటాలను విక్రయించే ఈ కంపెనీ 2005లో ఏర్పాటయింది. అప్పటినుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్న ఈ కంపెనీ ఓ దశలో 6 నెలల పాటు ఉద్యోగులకు జీతాలివ్వడానికి ఇబ్బంది పడిందట. ఆ సమయంలో ఉద్యోగులు ఒక్కరు కూడా జాబ్ మానేయకుండా కష్టకాలంలో కంపెనీ వెంట ఉన్నారంట. ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న కంపెనీ యాజమాన్యం అప్పట్నుంచీ ఉద్యోగులకు జీతాలతో పాటు వ్యాపారంలో వాటాలు కూడా ఇస్తోంది. మంచిగా పనిచేసే ఉన్నతస్థాయి ఉద్యోగులతో పాటు డ్రైవర్లు, హెల్పర్లకు కూడా కంపెనీ షేరును ఎంత ధర ఉన్నా కేవలం పది రూపాయలకే అందిస్తోంది. ఈ విధంగా2016 నుంచి ఇప్పటివరకు రూ. 300 కోట్లు ఇచ్చింది. అజీజ్ ప్రేమ్‌జీ పెట్టుబడులు పెట్టిన ఈ కంపెనీ ఇప్పటివరకు 54 శాతం వాటాను ఉద్యోగులకు ఇచ్చింది. ఇదికాక, సంస్థలో పనిచేసే సిబ్బందిలో 80 శాతం గ్రామీణులు ఉండడంతో వారిని తీసేయకుండా వారిలో కమ్యూనికేషన్ స్కిల్స్, సేల్స్ శిక్షణ, సాఫ్ట్ స్కిల్స్ వంటివి నేర్పుతుంది.