బ్యాంకులో ఉద్యోగం సాధించాలని కలలుకంటున్న యువతకు ఇదొక చక్కటి అవకాశం. ఇండస్ట్రీయల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI)ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు IDBI idbibank.in అధికారిక వెబ్‌సైట్‌ను చెక్ చేసి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఫిబ్రవరి 21 నుండి ప్రారంభమవుతుంది. ఇది మార్చి 3, 2023న ముగుస్తుంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా బ్యాంకులో ఖాళీగా ఉన్న 114 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్ట్‌లకు దరఖాస్తు చేయడానికి అర్హత, ఎంపిక ప్రక్రియ, ఇతర వివరాలు ఇవిగో.
ఖాళీల వివరాలు:
మేనేజర్: 42 పోస్టులు
అసిస్టెంట్ జనరల్ మేనేజర్: 29 పోస్టులు
డిప్యూటీ జనరల్ మేనేజర్: 10 పోస్టులు
పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్లో అందుబాటులో ఉన్న వివరణాత్మక నోటిఫికేషన్ ద్వారా విద్యార్హత, వయోపరిమితి గురించి తెలుసుకోవచ్చు.
ఎంపిక ప్రక్రియ:
పోస్ట్ కోసం దరఖాస్తు ఫారమ్‌లో పేర్కొన్నట్లుగా వయస్సు, విద్యార్హత, సంబంధిత శాఖలో పని చేసిన అనుభవం మొదలైన నిర్దేశిత అర్హత ప్రమాణాలు, మద్దతుగా అప్‌లోడ్ చేసిన పత్రాల ప్రాథమిక పరిశీలన ఉంటుంది. ప్రిలిమినరీ స్క్రీనింగ్ తర్వాత , పత్రాల ధృవీకరణ లేకుండా, అభ్యర్థిత్వం అన్ని పోస్ట్‌లు/గ్రేడ్‌లకు తాత్కాలికంగా ఉంటుంది.
దరఖాస్తు రుసుము:
జనరల్, EWS,OBC కేటగిరీకి దరఖాస్తు రుసుము రూ. 1000/- (దరఖాస్తు రుసుము + ఇంటిమేషన్ ఛార్జీలు) GST. SC/ST కేటగిరీ అభ్యర్థులు కలిపి రూ. 200/- చెల్లించాలి (ఇంటిమేషన్ ఛార్జీలు మాత్రమే) GSTతో కలిపి చెల్లించాలి దీన్ని డెబిట్ కార్డ్‌లు (రూపే/ వీసా/ మాస్టర్ కార్డ్/ మాస్ట్రో), క్రెడిట్ కార్డ్‌లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, IMPS, క్యాష్ కార్డ్‌లు/ మొబైల్ వాలెట్‌లను ఉపయోగించి చెల్లించవచ్చు.