తల్లి గర్భంలో ఫైట్ చేసిన కవలలు.. (వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

తల్లి గర్భంలో ఫైట్ చేసిన కవలలు.. (వీడియో)

April 17, 2019

తోడబుట్టిన వారు కొట్టుకోవడం సహజమే. కానీ, తల్లి గర్భంలోనే ఇద్దరు కొట్టుకుంటే. వినడానికి వింతగా ఉన్నా.. ఇది అక్షరాలా నిజం. తల్లి గర్భంలో ఫైట్ చేస్తున్న కవలల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చైనాకు చెందిన ఓ మహిళ గర్భంతో ఉన్న సమయంలో, వైద్యులు ఆమెకు అల్ట్రాసౌండ్ స్కానింగ్ తీశారు. ఆ సమయంలో ఆమె గర్భంలోని కవలలు ఒకరితో ఒకరు ఫైటింగ్ చేస్తున్నారు. దీన్ని వీడియో తీసిన ఆమె భర్త సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయగా, ఆ వీడియో వైరల్ అయింది. ఆ వీడియోపై నెటిజన్లు ఆసక్తికరంగా కామెంట్లు చేస్తున్నారు. ఈ కవలలు పెద్దయ్యాక బాక్సర్లు అవుతారని జోస్యం చెబుతున్నారు. బయటకు వచ్చాక ఇంకెలా తన్నుకుంటారోనన్న సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.