ఇప్పటివరకు 59 దేశాలకు పాకిన మంకీపాక్స్ వ్యాధి మొదటి సారి భారతదేశంలో ప్రవేశించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి కేరళకు వచ్చిన ఓ ప్రయాణీకుడిలో ఆ లక్షణాలు కనిపించాయని ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. వ్యక్తి నుంచి శాంపిల్స్ సేకరించి పుణెలోని వైరాలజీ ఇన్స్టిట్యూట్కు పంపామని, గురువారం సాయంత్రంలోగా అక్కడ నుంచి రిపోర్టు వస్తుందన్నారు. కాగా, 1958లో కోతుల్లో ఈ వైరస్ బయటపడడంతో దీనికి మంకీపాక్స్ అనే పేరు పెట్టారు. ఈ వైరస్ మశూచి కుటుంబానికి చెందినది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 8200 కేసులు నమోదయ్యాయి. ఒక్క అమెరికాలోనే దాదాపు 800 కేసులు బయటపడ్డాయి.