బేకరీ యజమానికి కరోనా.. 1000 మందికి పరీక్షలు - MicTv.in - Telugu News
mictv telugu

బేకరీ యజమానికి కరోనా.. 1000 మందికి పరీక్షలు

May 17, 2020

Bakery

కేరళాలో కరోనా కేసులు తక్కువగా ఉన్నాయని భావిస్తున్న సందర్భంలో ఓ బేకరీ యజమానికి కరోనా సోకడం కలకలం రేపుతోంది. దీంతో అతని బేకరీకి వచ్చే సుమారు 1000 మందికి కరోనా అంటించాడేమోనని అధికారులు అప్రమత్త చర్యలు చేపట్టారు. ఇడుక్కిలో బేకరీ యజమాని(39)కి కరోనా సోకినట్లు అధికారులు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు జిల్లాలోని రెండు గ్రామ పంచాయతీలను కంటైన్‌మెంట్ జోన్లుగా మార్చారు. ఆ బేకరీ యజమానిని పుట్టాడి ప్రాంతంలోని తాలూకా ఆసుపత్రిలో చేర్పించారు. అతని భార్య, పిల్లలను క్వారంటైన్‌కు తరలించారు. అతను ఎవరెవరిని కలిశాడు అన్న కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. 

హుటాహుటిన అతనితో సంబంధం ఉన్న వ్యక్తులను గుర్తించడానికి ర్యాండమ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. అతనితో కనీసం 1000 మంది సంప్రదింపులు జరిపారని తెలుస్తోంది. లాక్‌డౌన్‌లో సడలింపుల కారణంగా బేకరీ తెరిచి ఉంచాడు. దీంతో ప్రతిరోజూ వందలాది మంది కస్టమర్లు బేకరీకి వచ్చారు. ఇప్పుడు అధికారులు ఆ బేకరీకి వచ్చిన కష్టమర్లను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.