If challenged..will fight until defeated: spears
mictv telugu

సవాల్ చేస్తున్నా..గద్దెదించే వరకు పోరాడుతా: ఈటెల

September 13, 2022

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్‌ల మధ్య రోజు రోజుకు రాజకీయం వెడుక్కుతోంది. కేంద్ర ప్రభుత్వం మోటర్ల దగ్గర మీటర్లు పెట్టే ప్రయత్నం చేస్తోందని అధికార పార్టీవాళ్లు, లేదు లేదు కేంద్ర ప్రభుత్వం అలాంటి జీవోలు ప్రతిపాదించలేదని ప్రతిపక్ష నాయకులు వాదించుకుంటున్నారు. ఈ క్రమంలో ఈరోజు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సభ నుంచి సస్పెండ్ అయ్యారు.

ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ..’’మీ నాశనానికే ఇదంతా చేస్తున్నారు. ఏడాది కాలంగా నాపై కుట్ర చేస్తున్నారు. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఇప్పటివరకు అసెంబ్లీకి రాకుండా చేస్తున్నారు. ప్రశ్నిస్తుంటే గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోంది. ఈరోజు సవాల్ చేస్తున్నా..కేసీఆర్‌ను గద్దెదించే వరకు విశ్రమించను. మీ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు” అని ఆయన అన్నారు.

‘’బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందరను ఈరోజు స్పీకర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయనను స‌భ నుంచి వెంట‌నే సస్పెండ్ చేయాలంటూ వేముల ప్రశాంత్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. దీంతో ఈటెల‌ను ఈ సమావేశాలు పూర్తయ్యే వరకు శాసన సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీక‌ర్ ప్రకటించారు. సారీ చెప్పాలంటూ టీఆర్‌ఎస్ సభ్యులకు, ఈటల రాజేందర్ మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. సభా గౌరవాన్ని పాటించకుండా స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందున సభ నుంచి ఈటలను సస్పెండ్ చేయాలంటూ నినాదాలు చేశారు. స్పీకర్‌ను ‘మ‌ర మనిషి’ అంటూ ఈటల సంబోధించారని సభకు వెంటనే క్షమాపణలు చెప్పాలని ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కోరారు.’’