Home > Featured > ఇడ్లీ, దోశ కోసం కొబ్బరి చట్నీ ఇలా చేస్తే…టేస్ట్ అదిరిపోతుంది..!!

ఇడ్లీ, దోశ కోసం కొబ్బరి చట్నీ ఇలా చేస్తే…టేస్ట్ అదిరిపోతుంది..!!

If coconut chutney is made like this for idli and dosha...

మనం రోజూ రకరకాల టిఫిన్స్ తయారు చేసి తింటుంటాం. ఇడ్లీలు, దోశలు, వడలు ఇలా ఎన్నో రకాలు చేస్తుంటాం. ఇంట్లో చేయడానికి వీలుకానప్పుడు..బయట నుంచి తెచ్చుకుని తింటాం. అయితే బయట మనకు ఇడ్లీ, కానీ దోశలోకి కానీ ఇచ్చే చట్నీ రుచిగా ఉంటుంది. కానీ ఇంట్లో ఆ రుచి రాదు. కానీ కాస్త ఓపికతో ఇంట్లోనే రుచికరమైన ఇడ్లీ తయారు చేయడం చాలా సులభం. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

-పల్నీలు, లేదా పుట్నాలు
-అల్లం
-1 కప్పు తురిమిన కొబ్బరి
-2 పచ్చిమిర్చి
-1/2 కప్పు కొత్తిమీర
-ఉప్పు తగినంత
-1/2 స్పూన్ నిమ్మరసం
-ఎండు మిరపకాయలు,
-ఆవాలు జీలకర్ర
-కరివేపాకు.

తయారీ విధానం:

ముందుగా స్టౌ మీద పాన్ పెట్టి ఒక టీస్పూన్ ఆయిల్‌ వేయాలి. ఆయిల్ వేడి అవ్వగానే ఒక చిన్న కప్పు పల్లీలు, పచ్చి మిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చి మిరపకాయలను వేయించుకునేట‌ప్పుడు తుంచుకుని వేసుకుంటే బాగుంటుంది. తర్వాత అందులో అల్లం ముక్క, కొద్దిగా కొత్తిమీర వేసుకుని కలపాలి. మీకు కావాల్సిన కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోవాలి.

కొత్తిమీర, అల్లం వేగిన తర్వాత మిక్సీ జార్‌లో వేసి…పల్లీలు వేసుకోవ‌చ్చు. ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. పచ్చి కొబ్బరి ఫ్రెష్ గా ఉంటేనే చ‌ట్నీ రుచి బాగుంటుంది. తర్వాత టేస్ట్ కు తగినంత ఉప్పు, ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో ఉప్పు, గ్లాస్ నీళ్లు పోసుకుని మెత్తగా మీక్సీ చేయాలి. మనం పల్లీలు, పుట్నాలు, కొబ్బరి సమానంగా వేసుకుంటేనే రుచి బాగుంటుంది. చ‌ట్నీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉంటే బాగుంటుంది.

ఇప్పుడు పాన్ స్టౌ మీద పెట్టి…కొంచెం నూనె పోసి అందులో ఆవాలు, జీలకర్ర వేయాలి. అవి వేగిన తర్వాత అందులో కరివేపాకు వేయాలి. దాన్ని చట్నీలో పోపు పెట్టాలి. అంతే రుచికరమైన కొబ్బరి చట్నీ రెడీ.

Updated : 28 May 2023 12:01 AM GMT
Tags:    
Next Story
Share it
Top