డయాబెటిస్ రోగులు పరగడుపున ఈపొడి పాలలో కలిపి తీసుకుంటే షుగర్ అదుపులో ఉంటుందట.. - MicTv.in - Telugu News
mictv telugu

డయాబెటిస్ రోగులు పరగడుపున ఈపొడి పాలలో కలిపి తీసుకుంటే షుగర్ అదుపులో ఉంటుందట..

March 11, 2023

ప్రస్తుతం దేశంలోనూ, ప్రపంచంలోనూ షుగర్ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ వ్యాధి ప్రాణాంతంకం కాకపోయినప్పటికీ నిర్లక్ష్యం చేస్తే మాత్రం ప్రాణాలమీదకు వస్తుంది. ఒకసారి షుగర్ సోకిందంటే అది పూర్తిగా మానదు. మన జీవనశైలితో దాన్ని అదుపులో ఉంచుకోవాల్సిందే. అందుకే ఈ వ్యాధి పట్ల ప్రజలు చాలా జాగ్రత్తగా ఉటారు. అయితే అనేక ఇంటి నివారణల ద్వారా షుగర్ ను అదుపులో ఉంచుకోవచ్చు. అందులో ఒకటి నేరేడు పండు.

నేరేడు పండు తీపి, కొద్దిగా పులుపు, రుచిలో కొద్దిగా ఆస్ట్రింగ్‌గా ఉంటుంది. నేరేడు పండు గురించి ఆయుర్వేదంలో చాలా ప్రాముఖ్యత ఉందని పేర్కొంది. ఇందులో ఫైబర్, మెగ్నీషియం, ఐరన్, విటమిన్ ఎ, B C పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నేరేడు పండు తినడం వల్ల మధుమేహ రోగులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. షుగర్ పేషెంట్స్ ఈ పండును ఆహారంలో చేర్చుకుంటే, వారి షుగర్ లెవెల్ అదుపులో ఉంటుంది. డయాబెటిక్ రోగుల ఆహారంలో నేరేడు పండు ఎలా చేర్చాలో తెలుసుకోండి,

షుగర్ పేషెంట్ :

ముందుగా నేరేడు పండు గింజలను నీటిలో బాగా కడిగి ఆరబెట్టాలి. గింజలు ఆరిపోయాక గ్రైండర్ లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో పాలలో ఒక చిన్న చెంచా పొడిని తీసుకోండి. ఇలా రోజూ చేయడం వల్ల డయాబెటిక్ పేషెంట్స్ బ్లడ్ షుగర్ లెవెల్ కంట్రోల్ అవుతుంది. దీంతో పాటు పొట్ట సంబంధిత సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు.

నేరేడు పండు తినడం వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు:

 ఉదర సమస్యలలో ఉపశమనాన్ని అందిస్తుంది:

రేడు పండు తీసుకుంటే, కడుపు సంబంధిత సమస్యలు దూరమవుతాయి. దీని బెరడును కషాయం చేసి తాగితే కడుపునొప్పి, అజీర్తి వంటి సమస్యలు దూరమవుతాయి.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది:

ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడతాయి. దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో రక్తం కొరత తీరుతుంది. దీంతో శరీరంలో రక్తం స్థాయి పెరగడం ప్రారంభమవుతుంది.

కిడ్నీలో రాళ్ల సమస్య నుండి ఉపశమనం ఇస్తుంది:

ఒక వ్యక్తికి కిడ్నీలో రాళ్ల సమస్య ఉంటే, ఈ గింజలు దానిలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. రాళ్లతో బాధపడేవారు ఈ పొడిని పెరుగులో కలిపి తినాలి. ఇలా చేయడం వల్ల ఉపశమనం కలుగుతుంది.