వారికి అవి ఇస్తే నేను టీఆర్ఎస్‌లో చేరుతా.. జగ్గారెడ్డి - MicTv.in - Telugu News
mictv telugu

వారికి అవి ఇస్తే నేను టీఆర్ఎస్‌లో చేరుతా.. జగ్గారెడ్డి

March 14, 2022

bffb

సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డిలతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారంట కదా? అనే ప్రశ్నకు సమాధానంగా ‘తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో పనిచేసిన జర్నలిస్ట్‌లకు ఇళ్లు, జాగ్వార్ కార్లు ఇస్తే అధికార పార్టీలో చేరడానికి సిద్ధమే’నంటూ వ్యాఖ్యానించారు. అంతేకాక, తన డిమాండ్‌ను నెరవేరిస్తే ఒక పర్యాయం ఎన్నికల పోటీకి దూరంగా ఉంటానంటూ సంచలన ప్రకటన చేశారు. కాగా, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చినా.. జగ్గారెడ్డి పలు మార్లు పార్టీపైనా, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపైనా అనేక విమర్శలు చేశారు. ఓ దశలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి సొంత పార్టీ పెడతానని బహిరంగంగానే ప్రకటించారు. ఈ నేపథ్యంలో జగ్గారెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యల పట్ల ఇతర కాంగ్రెస్ నేతలు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.