ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి రోజా గురువారం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ”ముందుగా అందరికి అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు మనదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా వర్ధిల్లుతుందంటే మనం మొదటగా అంబేద్కర్ గారి పేరునే చెప్పుకోవాలి. అంబేద్కర్ ఎదైతే కోరుకున్నాడో, దానిని స్పూర్తిగా తీసుకొని నేను ఈరోజు చెప్పగలను.
గర్వంగా చెప్పగలను. నిజమైన అంబేద్కర్ గారిని, ఆయన ఆశయాలను ఇన్స్పిరేషన్ తీసుకోని, ఆయన కోరుకున్న సమసమాజాన్ని స్థాపించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డినే. ఈనాడు రాష్ట్ర ప్రజలకు జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాల వల్ల ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారు. జగన్ మోహన్ రెడ్డిని ప్రజలు మెచ్చుకుంటున్నారు. తాజాగా ఫాం అయిన కేబినేట్ చూస్తే, దాదాపుగా 70 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకే మంత్రి పదవులను జగన్ ఇచ్చారు. నిజంగా ఈరోజు అంబేద్కర్ గారు బతికి ఉంటే మాత్రం కచ్చితంగా జగన్ మోహన్ రెడ్డి గారిని అభినందించేవారని నేను ఘంటాపథంగా చెప్పగలను” అని రోజా అన్నారు.