If he sees him, he will give a hundred kisses: Surekhavani
mictv telugu

ఆయన కనిపిస్తే వంద ముద్దులు పెడతా: సురేఖావాణి

September 3, 2022

టాలీవుడ్‌లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ప్రేక్షకుల్లో మంచి పేరును సంపాదించుకున్న సురేఖావాణి..తాజాగా చేసిన వ్యాఖ్యలు తెలుగు సినిమా పరిశ్రమలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరో అంటే ఇష్టమని యాంకర్ అడిగిన ప్రశ్నకు..తనకు చిరంజీవి అంటే ఇష్టమని, పవన్ కల్యాణ్ కనిపిస్తే క్షణం ఆలోచించకుండా వంద ముద్దులు పెడతానని సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

వివరాల్లో వెళ్తే.. తాజాగా సురేఖావాణి ఓ షోకు అతిధిగా హాజరయ్యారు. త‌న వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ”నా భర్త చనిపోవడంతో అత్తింటివారి వేధింపులకు తట్టుకొలేక బయటకి వచ్చా. తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవికి నేను పెద్ద అభిమానిని. ఎందుకంటే.. ఓ రోజు నేను ఏడుస్తుంటే చిరంజీవీ నన్ను ఓదార్చారు. ఇంటికి భోజనానికి కూడా ఆహ్వానించారు” అని అంది.

ఆ తర్వాత యాంకర్..చివ‌రిగా ఓ ప్రశ్న అంటూ..’తెలుగు పరిశ్రమలో ఈ హీరోల్లో ఎవరికైనా వంద ముద్దులు ఇవ్వాలనుకుంటే మీరు ఎవరికిస్తారు’ అంటూ సురేఖవాణిని అడిగాడు. దానికి ఆమె వెంట‌నే ”పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ కనిపిస్తే వంద ముద్దులు పెడతాను” అని సమాధానం ఇచ్చింది.

మరోపక్క తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ..’రెండో పెళ్లికి నేను దూరం. కానీ, నాకు బోయ్ ఫ్రెండ్ మాత్రం కావాలి’ అంటూ కాబోయే బోయ్ ఫ్రెండ్‌కు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో కూడా ఆమె తెలిపింది. ఈ క్రమంలో మరోసారి పవన్ కల్యాణ్‌కు వంద ముద్దులు పెడతానని వ్యాఖ్యలు చేయడంతో సంచలనంగా మారింది.