నాకంత సీన్ ఉంటే ఎందుకు ఓడిపోతా: చంద్రబాబు - MicTv.in - Telugu News
mictv telugu

నాకంత సీన్ ఉంటే ఎందుకు ఓడిపోతా: చంద్రబాబు

March 3, 2022

 

019

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జగన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం మంగళగిరిలో సర్పంచ్‌ల అవగాహన సదస్సుకు ఆయన హాజరయ్యారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. ”వైసీపీ నేతలు ఏం జరిగినా దానికి నేనే కారణమంటారు. వివేకా హత్య విషయంలోనూ నాపై ఆరోపణలు చేశారు. అవినాశ్ రెడ్డి వచ్చి చూడు. నేనే శివశంకర్ రెడ్డితో చెప్పించా. రెండోరోజు సాక్షిలో ‘నారాసురవధ చరిత్ర’ అని కూడా నేనే రాయించా. ఆ పేపర్‌కు కూడా నేనే ఎడిటర్‌ని. ఏం కథలు అల్లారు. జగన్ రెడ్డి మామకు చెందిన ఆసుపత్రి వాళ్లను కూడా నేనే రమ్మని చెప్పి, వారితో బ్యాండేజీల కుట్లన్నీ వేయించా. ఏమి నాటకాలయ్యా.! బాడీని తీసుకెళ్లేందుకు ఓ బాక్సు కూడా ఏర్పాటు చేశారు. అక్కడ రక్తం కనిపించకుండా ఉండేందుకు పూలు వేయించారు’ అని సీఐ చెప్పాడు అంటూ సైటర్లు వేశాడు.

అంతేకాకుండా ఆ పూలు కూడా నేనే వేయించా. అక్కడ ఉండేవాళ్లందరూ మన మనుషులే కదా.! శివశంకర్ రెడ్డి మన మనిషే, గంగిరెడ్డి మన మనిషే, సునీల్ యాదవ్ మన మనిషే, అవినాశ్ రెడ్డి కూడా మన మనిషే, చివరికి జగన్ రెడ్డి కూడా మన మనిషే! వివేకా కుమార్తె సునీత మన చేతిలో పావే, భారతి రెడ్డి కూడా ఇప్పుడు.. ఏం చెప్పాలో నాకైతే అర్థంకావడంలేదు” అంటూ చంద్రబాబు సెటైర్ల వర్షం కురిపించారు. దాంతో, ఆ సదస్సులో సదస్సులో నవ్వులు విరబూశాయి.

ఇక చివరగా.. సీబీఐ విచారణ వేస్తే సీబీఐలోనూ నా వాళ్లే ఉన్నారన్నారు. సినిమా టికెట్ల అంశానికి నేనే కారణమంటున్నారు, ఉద్యోగుల ఆందోళనలకు నేనే కారణమంటున్నారు. నిజంగానే అంత పలుకుబడి నాకుంటే నేనెందుకు ఓడిపోతానయ్యా! ఎన్నికలను కూడా మేనేజ్ చేసుకోలేనా? ఏది చెప్పినా ప్రజలు నమ్ముతారు. ఏది చెప్పి అయినా ప్రజలను మోసం చేయవచ్చు అని అనుకుంటున్నారు” అంటూ చంద్రబాబు విమర్శనాస్త్రాలు సంధించారు.